ఇటువంటి సుద్దులకు యెరిఁది సాకిరైవచ్చు
(॥పల్లవి॥)
ఇటువంటి సుద్దులకు యెరిఁది సాకిరైవచ్చు
విటకుక్కితనాలెల్ల వెరగంది చూతుము
(॥ఇటు॥)
తగవెరిఁగినవాఁడు తానే కనక మరి
జగడాలు దిద్దీని సవతులకు
తెగువగలదొకతె తిట్టదాయ నందులోన
పెగడతనాలెల్లఁ బ్రియముతో విందుము
(॥ఇటు॥)
అంకెల నెడమాటలు ఆడనేరుచుఁ గనక
వంక లొత్తి కూరిచీని వనితలను
కొంకలేకందొకతైనా గొబ్బనఁ జైక మోపదాయ
బింకపు తనలావులు పేరుకొని మెత్తుము
(॥ఇటు॥)
మంతుకెక్కి యీ పనికి మాసటీఁడు తానె కన
పంతము లిప్పించీని పడఁతులకు
వింతఁగా నన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁ డిట్టె వచ్చి
ఇంతవని ఇప్పుడైతే యీడేరింతుఁ బనులు
(||pallavi||)
iḍuvaṁṭi suddulagu yĕrim̐di sāgiraivachchu
viḍagukkidanālĕlla vĕragaṁdi sūdumu
(||iḍu||)
tagavĕrim̐ginavām̐ḍu tāne kanaga mari
jagaḍālu diddīni savadulagu
tĕguvagaladŏgadĕ tiṭṭadāya naṁdulona
pĕgaḍadanālĕllam̐ briyamudo viṁdumu
(||iḍu||)
aṁkĕla nĕḍamāḍalu āḍanerusum̐ ganaga
vaṁka lŏtti kūrisīni vanidalanu
kŏṁkalegaṁdŏgadainā gŏbbanam̐ jaiga mobadāya
biṁkabu tanalāvulu perugŏni mĕttumu
(||iḍu||)
maṁtugĕkki yī panigi māsaḍīm̐ḍu tānĕ kana
paṁtamu lippiṁchīni paḍam̐tulagu
viṁtam̐gā nannum̐ gūḍĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ vachchi
iṁtavani ippuḍaide yīḍeriṁtum̐ banulu