Iduvamti selinela yelayimchevu

ఇటువంటి చెలినేల యెలయించేవు
Language

(॥పల్లవి॥)
ఇటువంటి చెలినేల యెలయించేవు
తటుకునఁ గాఁగిలించి దయఁజూడవయ్యా

(॥ఇటు॥)
యేపొద్దునీతో నవ్వ నెఱుఁగు నింతేకాని
కోపగించ నెఱఁగదు కొమ్మ యఁ(యం?)తైనా
చూపుల నినుఁజూచి చొక్కఁగ నెఱుఁగుఁగాని
యేపునఁ దలవంచఁగ నెఱఁగ దెప్పుడును

(॥ఇటు॥)
చలపట్టి నీతో సరసమాడ నెఱుఁగుఁగాని
యెలమిఁ బలుకకుండ నెఱఁగ దీకె
వలచి ప్రియము చెప్పి వంచుకోనెఱుఁగుఁగాని
అలుగఁగ నెఱఁగ దెంతైనా నీతోను

(॥ఇటు॥)
పానుపుపైఁ గాఁగిలించి పైకొననెఱుఁగుఁగాని
ఆనలువెట్టినాఁ బాయనెఱఁగదు
యీనెపాన శ్రీవేంకటేశ యింతిఁ గూడితివి
తేనెమో వెఱుఁగుఁగాని తెగువయెఱఁగదు

(||pallavi||)
iḍuvaṁṭi sĕlinela yĕlayiṁchevu
taḍugunam̐ gām̐giliṁchi dayam̐jūḍavayyā

(||iḍu||)
yebŏddunīdo navva nĕṟum̐gu niṁtegāni
kobagiṁcha nĕṟam̐gadu kŏmma yam̐(yaṁ?)tainā
sūbula ninum̐jūsi sŏkkam̐ga nĕṟum̐gum̐gāni
yebunam̐ dalavaṁcham̐ga nĕṟam̐ga dĕppuḍunu

(||iḍu||)
salabaṭṭi nīdo sarasamāḍa nĕṟum̐gum̐gāni
yĕlamim̐ balugaguṁḍa nĕṟam̐ga dīgĕ
valasi priyamu sĕppi vaṁchugonĕṟum̐gum̐gāni
alugam̐ga nĕṟam̐ga dĕṁtainā nīdonu

(||iḍu||)
pānububaim̐ gām̐giliṁchi paigŏnanĕṟum̐gum̐gāni
ānaluvĕṭṭinām̐ bāyanĕṟam̐gadu
yīnĕbāna śhrīveṁkaḍeśha yiṁtim̐ gūḍidivi
tenĕmo vĕṟum̐gum̐gāni tĕguvayĕṟam̐gadu