Iduvamti ramanuni nemta seseve

ఇటువంటి రమణుని నెంత సేసేవే
Language

(॥పల్లవి॥)
ఇటువంటి రమణుని నెంత సేసేవే
అటు నిటు నవ్వీఁగాని అలుగఁడు గదవే

(॥ఇటు॥)
వొడ్డరము లాడఁడు వొడివట్టితీసి నిన్ను
వెడ్డువెట్టి వేఁడుకొంటే వేసరనేలే
జిడ్డుదేర నీవతనిఁ జేసిన చేఁతల కెల్లా
వొడ్డించుకొనీఁ గాని వోపననఁడుగదే

(॥ఇటు॥)
తత్తరించఁ డేమిటికి తములమొసగీ తాను
బత్తి నీపైఁ జేయఁగాను పంగించనేలే
యెత్తినమదాన నీవు యెంత కరకరించినా
హత్తుకవున్నాఁడు గాని అలయఁడు గదవే

(॥ఇటు॥)
చండి చేసి పెనఁగఁడు సన్నలనే మోవి చూపి
నిండు గాఁగిటఁ గూడఁగా నివ్వెరగేలే
అండనె శ్రీవేంకటేశుఁ డతఁడు నీరతులకు
దండిగా మెచ్చీఁగాని తలఁకఁడు గదవే

(||pallavi||)
iḍuvaṁṭi ramaṇuni nĕṁta seseve
aḍu niḍu navvīm̐gāni alugam̐ḍu gadave

(||iḍu||)
vŏḍḍaramu lāḍam̐ḍu vŏḍivaṭṭidīsi ninnu
vĕḍḍuvĕṭṭi vem̐ḍugŏṁṭe vesaranele
jiḍḍudera nīvadanim̐ jesina sem̐tala kĕllā
vŏḍḍiṁchugŏnīm̐ gāni vobananam̐ḍugade

(||iḍu||)
tattariṁcham̐ ḍemiḍigi tamulamŏsagī tānu
batti nībaim̐ jeyam̐gānu paṁgiṁchanele
yĕttinamadāna nīvu yĕṁta karagariṁchinā
hattugavunnām̐ḍu gāni alayam̐ḍu gadave

(||iḍu||)
saṁḍi sesi pĕnam̐gam̐ḍu sannalane movi sūbi
niṁḍu gām̐giḍam̐ gūḍam̐gā nivvĕragele
aṁḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu nīradulagu
daṁḍigā mĕchchīm̐gāni talam̐kam̐ḍu gadave