ఇటువంటి పొందులకు నింతినేల వొరసేవు
(॥పల్లవి॥)
ఇటువంటి పొందులకు నింతినేల వొరసేవు
సటలకు నవ్వినాను చవిగాకపోదు
(॥ఇటు॥)
యెసనెట్టుకొని సతు లెంత పతిఁ దిట్టినాను
కొసరులై సతు లెంతపతిఁ దిట్టినాను
కసరి చేతికి లోనుగాక పెనఁగితేను
అసమునఁ దరితీపు లౌఁగాక మానదు
(॥ఇటు॥)
కన్నులను జంకించి కామిని లెట్టలిగినా
సన్నలై తోఁచుఁగాని చలమెక్కదు
కన్నచోట నిన్ను చూపుగాఁడిపారఁ జూచినాను
ఇన్నిటా వలపు రేఁచి యెనయించకుండదు
(॥ఇటు॥)
అంగనలు గోరగీరిఆయము లెంతంటివాను
సింగారమే మించుఁగాని చింతెరఁగదు
రంగుగ శ్రీవేంకటేశ రతి నీకె గూడె నిన్ను
సంగడి జాణతనాలు చాయలకే వచ్చును
(||pallavi||)
iḍuvaṁṭi pŏṁdulagu niṁtinela vŏrasevu
saḍalagu navvinānu savigāgabodu
(||iḍu||)
yĕsanĕṭṭugŏni sadu lĕṁta padim̐ diṭṭinānu
kŏsarulai sadu lĕṁtabadim̐ diṭṭinānu
kasari sedigi lonugāga pĕnam̐gidenu
asamunam̐ daridību laum̐gāga mānadu
(||iḍu||)
kannulanu jaṁkiṁchi kāmini lĕṭṭaliginā
sannalai tom̐sum̐gāni salamĕkkadu
kannasoḍa ninnu sūbugām̐ḍibāram̐ jūsinānu
inniḍā valabu rem̐si yĕnayiṁchaguṁḍadu
(||iḍu||)
aṁganalu goragīriāyamu lĕṁtaṁṭivānu
siṁgārame miṁchum̐gāni siṁtĕram̐gadu
raṁguga śhrīveṁkaḍeśha radi nīgĕ gūḍĕ ninnu
saṁgaḍi jāṇadanālu sāyalage vachchunu