Iduvamti panulai te nimdaru ninnemamduru

ఇటువంటి పనులై తే నిందరు నిన్నేమందురు
Language

(॥పల్లవి॥)
ఇటువంటి పనులై తే నిందరు నిన్నేమందురు
కటకటా ఇఁకనైనాఁ గరుణించు మిపుడు

(॥॥)
మొల్లమిగా నాకె నీకు మోహించు టెఱఁగవా
చెల్లఁబో నీవేల జోలిసేసేవో కాక
తొల్లె నీరాకకు నెదురుచూచే దెఱఁగవా
వొల్లను నవ్వుకొంటా నున్నాఁడవు గాక

(॥॥)
వద్దనుండి నీకాపె సేవసేసే దెఱఁగవా
అద్దిరా నీవేల పరాకైతివో కాక
ముద్దు ముద్దు వలె నీకు మొక్కే దెఱఁగవా
సుద్దుల నీగుణా లేమి చూపేవో కాక

(॥॥)
తాలిమితో నిన్నునాపె దక్కఁగొన్న దెఱఁగవా
మేలు మేలుఇంతయేల మీరేవో కాక
యీలీల శ్రీవేంకటేశ ఇంతి నిట్టె కూడితివి
వేళ నీవెఱఁగవా నీవేడుకలు గాక

(||pallavi||)
iḍuvaṁṭi panulai te niṁdaru ninnemaṁduru
kaḍagaḍā im̐kanainām̐ garuṇiṁchu mibuḍu

(||||)
mŏllamigā nāgĕ nīgu mohiṁchu ṭĕṟam̐gavā
sĕllam̐bo nīvela jolisesevo kāga
tŏllĕ nīrāgagu nĕdurusūse dĕṟam̐gavā
vŏllanu navvugŏṁṭā nunnām̐ḍavu gāga

(||||)
vaddanuṁḍi nīgābĕ sevasese dĕṟam̐gavā
addirā nīvela parāgaidivo kāga
muddu muddu valĕ nīgu mŏkke dĕṟam̐gavā
suddula nīguṇā lemi sūbevo kāga

(||||)
tālimido ninnunābĕ dakkam̐gŏnna dĕṟam̐gavā
melu meluiṁtayela mīrevo kāga
yīlīla śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ kūḍidivi
veḽa nīvĕṟam̐gavā nīveḍugalu gāga