ఇటువంటి నేరుపు మీయద్దరందుఁ గంటిమే
(॥పల్లవి॥)
ఇటువంటి నేరుపు మీయద్దరందుఁ గంటిమే
తటుకన నీ కతఁడు తా మేలువాఁడే
(॥ఇటు॥)
చనవు గలిగితేను సరసము లీడేరు
మనవులు వింటేను మాఁట లింపౌను
పెనఁగు లాడితేను ప్రియములు చేకూరు
ననుపు గలిగితేను నవ్వులు సమ్మతులు
(॥ఇటు॥)
ఆసపడి చూచితేను ఆయములు గరఁగును
వాసితోడ నుంటేను వసమౌఁ బొందు
సేలు పైఁ జల్లి తేను చేకొనుఁ జుట్టరికము
వేసర కుండితేను వేడుకలౌ రతులు
(॥ఇటు॥)
సిగ్గుతోడ మెలఁగితేను చిమ్మి రేఁగు దరితీవు
యెగ్గులేమి నెంచుకున్న నితవౌఁ దమి
అగ్గమై శ్రీవేంకటేశుఁడ న్నిటాను నిన్నుఁగూడె
నిగ్గుల నీతగవులు నెరపుటే భాగ్యము
(||pallavi||)
iḍuvaṁṭi nerubu mīyaddaraṁdum̐ gaṁṭime
taḍugana nī kadam̐ḍu tā meluvām̐ḍe
(||iḍu||)
sanavu galigidenu sarasamu līḍeru
manavulu viṁṭenu mām̐ṭa liṁpaunu
pĕnam̐gu lāḍidenu priyamulu segūru
nanubu galigidenu navvulu sammadulu
(||iḍu||)
āsabaḍi sūsidenu āyamulu garam̐gunu
vāsidoḍa nuṁṭenu vasamaum̐ bŏṁdu
selu paim̐ jalli tenu segŏnum̐ juṭṭarigamu
vesara kuṁḍidenu veḍugalau radulu
(||iḍu||)
siggudoḍa mĕlam̐gidenu simmi rem̐gu daridīvu
yĕggulemi nĕṁchugunna nidavaum̐ dami
aggamai śhrīveṁkaḍeśhum̐ḍa nniḍānu ninnum̐gūḍĕ
niggula nīdagavulu nĕrabuḍe bhāgyamu