ఇటువంటి నీ సుద్దులు యెవ్వఁడెరుఁగు
(॥పల్లవి॥)
ఇటువంటి నీ సుద్దులు యెవ్వఁడెరుఁగు
నటనలే సేసేవు నడుమ నీవు
(॥ఇటు॥)
పలుకుఁ బంతాలనే పలుమారు మాఁటాడేవే
చెలఁగి యెన్నఁడు నేరిచితివోకాని
కలికితనాలనే కాఁపురాలు సేసేవే
మెలుపునఁ బతి నెంత మెప్పించేవోకాని
(॥ఇటు॥)
దారకపుఁదనాలనే దండనుండి బిగిసేవే
బీరము లింకా నెన్ని పెంచేవో కాని
నేరుపులే పచరించి నీటు లెంత చూపేవే
పేరఁబెట్టి యెమ్మె లెంత పెనచేవోకాని
(॥ఇటు॥)
మఱఁగు మొఱఁగులనే మంతనా లేమాడేవే
కఱత లెన్ని నీవల్లఁ గలవోకాని
యెఱుకతోనే శ్రీవేంకటేశుఁడు నన్నిట్టె యేలె
మఱి నీవితని నెంత మరిపేవోకాని
(||pallavi||)
iḍuvaṁṭi nī suddulu yĕvvam̐ḍĕrum̐gu
naḍanale sesevu naḍuma nīvu
(||iḍu||)
palugum̐ baṁtālane palumāru mām̐ṭāḍeve
sĕlam̐gi yĕnnam̐ḍu nerisidivogāni
kaligidanālane kām̐purālu seseve
mĕlubunam̐ badi nĕṁta mĕppiṁchevogāni
(||iḍu||)
dāragabum̐danālane daṁḍanuṁḍi bigiseve
bīramu liṁkā nĕnni pĕṁchevo kāni
nerubule pasariṁchi nīḍu lĕṁta sūbeve
peram̐bĕṭṭi yĕmmĕ lĕṁta pĕnasevogāni
(||iḍu||)
maṟam̐gu mŏṟam̐gulane maṁtanā lemāḍeve
kaṟada lĕnni nīvallam̐ galavogāni
yĕṟugadone śhrīveṁkaḍeśhum̐ḍu nanniṭṭĕ yelĕ
maṟi nīvidani nĕṁta maribevogāni