Iduvamti nee suddulu yemtani pogadavachchu

ఇటువంటి నీ సుద్దులు యెంతని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇటువంటి నీ సుద్దులు యెంతని పొగడవచ్చు
తటుకన నీకు నిందరము మొక్కేమయ్యా

(॥ఇటు॥)
వచ్చి వచ్చి వనితకు వలపులు రేఁచితివి
గచ్చులుసేసి మనసు గరఁచితివి
మచ్చికతో నవ్వుతానే మరిగించుకొంటివి
ఇచ్చట నీ నేరుపులు యేమి చెప్పేమయ్యా

(॥ఇటు॥)
మంచివానివలెనే మాటలఁ జొక్కింతివి
లంచముగ మోవిచ్చి యలయించితివి
అంచల సన్నలుసేసి యాసలు వుట్టించితివి
యెంచరాదు నీ నేరుపు లేమి చెప్పేవయ్యా

(॥ఇటు॥)
చెనకుచుఁ గొప్పు దివ్వి చెలిమికాఁడ వైతివి
వినయానఁ గాఁగిలించి వెలయించితి
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
ఇనుమడి నీ నేరుపు లేమి చెప్పేమయ్యా

(||pallavi||)
iḍuvaṁṭi nī suddulu yĕṁtani pŏgaḍavachchu
taḍugana nīgu niṁdaramu mŏkkemayyā

(||iḍu||)
vachchi vachchi vanidagu valabulu rem̐sidivi
gachchulusesi manasu garam̐sidivi
machchigado navvudāne marigiṁchugŏṁṭivi
ichchaḍa nī nerubulu yemi sĕppemayyā

(||iḍu||)
maṁchivānivalĕne māḍalam̐ jŏkkiṁtivi
laṁchamuga movichchi yalayiṁchidivi
aṁchala sannalusesi yāsalu vuṭṭiṁchidivi
yĕṁcharādu nī nerubu lemi sĕppevayyā

(||iḍu||)
sĕnagusum̐ gŏppu divvi sĕlimigām̐ḍa vaidivi
vinayānam̐ gām̐giliṁchi vĕlayiṁchidi
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
inumaḍi nī nerubu lemi sĕppemayyā