Iduvamti maanaabadi nimtaseduraa

ఇటువంటి మానాపతి నింతసేతురా
Language

(॥పల్లవి॥)
ఇటువంటి మానాపతి నింతసేతురా
తటుకన లాలించి దయఁజూడు మిఁకను

(॥ఇటు॥)
చెప్పరానిమాఁట లేమి చెప్పితివో చెలితోను
అప్పటనుండి బొమ్మల నద్దలించీని
రెప్పల తుదలను యేరీతి సన్నసేసితివో
చప్పడుగా విరులను సారెకు వేసీని

(॥ఇటు॥)
గుట్టుతొడ నెట్లా నిక్కువలు సోఁకించితివో
దట్టించి పెదవులుగదల దూరీని
చిట్టంటుఁజేఁతల నేడ సిగ్గులు రేఁచితివో
చుట్టి చుట్టి ములువాఁడి చూపులఁ జూచీని

(॥ఇటు॥)
వేడుకరతులు యెంత వెల్లవిరి సేసితివో
వోడక పెసఁగుతా నీ వొడివట్టీని
యీడనే శ్రీవేంకటేశ యీపె నెంత యేలితివో
జోడు గూడి నిన్నిప్పడు చొక్కుతా మెచ్చీని

(||pallavi||)
iḍuvaṁṭi mānābadi niṁtasedurā
taḍugana lāliṁchi dayam̐jūḍu mim̐kanu

(||iḍu||)
sĕpparānimām̐ṭa lemi sĕppidivo sĕlidonu
appaḍanuṁḍi bŏmmala naddaliṁchīni
rĕppala tudalanu yerīdi sannasesidivo
sappaḍugā virulanu sārĕgu vesīni

(||iḍu||)
guṭṭudŏḍa nĕṭlā nikkuvalu som̐kiṁchidivo
daṭṭiṁchi pĕdavulugadala dūrīni
siṭṭaṁṭum̐jem̐tala neḍa siggulu rem̐sidivo
suṭṭi suṭṭi muluvām̐ḍi sūbulam̐ jūsīni

(||iḍu||)
veḍugaradulu yĕṁta vĕllaviri sesidivo
voḍaga pĕsam̐gudā nī vŏḍivaṭṭīni
yīḍane śhrīveṁkaḍeśha yībĕ nĕṁta yelidivo
joḍu gūḍi ninnippaḍu sŏkkudā mĕchchīni