ఇటువంటి కొత్తలు నే మెఱఁగమమ్మ
(॥పల్లవి॥)
ఇటువంటి కొత్తలు నే మెఱఁగమమ్మ
చిటుకుమనినంతనే చిమ్మిరేఁగేవు
(॥ఇటు॥)
మంచి మాఁటాడేపతిని మలసి తిట్టే ననేవు
యెంచరానిరాఁగతన మేల సేసేవే
పొంచి పువ్వుల వేసితే బొప్పిగట్టె మేననేవు
నించి యాతఁ డందుకేపో నివ్వెరగు నందెను
(॥ఇటు॥)
పచ్చడము గప్పితేనే బలిమిసేసె ననేవు
అచ్చలాన నీ వెంతగయ్యాళివే నేఁడు
పచ్చిమోవి యానఁగాను పగసాదించీ ననేవు
కచ్చుపెట్టి యివియెల్ల గామిడితనములా
(॥ఇటు॥)
యేకతానకుఁ దీసితే యీడిచెను నిన్ననేవు
పైకొని యెంతటినేరుపరివే నీవు
యీకడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
మేకొని యిందుకే నేము మెచ్చితిమే నిన్నును
(||pallavi||)
iḍuvaṁṭi kŏttalu ne mĕṟam̐gamamma
siḍugumaninaṁtane simmirem̐gevu
(||iḍu||)
maṁchi mām̐ṭāḍebadini malasi tiṭṭe nanevu
yĕṁcharānirām̐gadana mela seseve
pŏṁchi puvvula veside bŏppigaṭṭĕ menanevu
niṁchi yādam̐ ḍaṁdugebo nivvĕragu naṁdĕnu
(||iḍu||)
pachchaḍamu gappidene balimisesĕ nanevu
achchalāna nī vĕṁtagayyāḽive nem̐ḍu
pachchimovi yānam̐gānu pagasādiṁchī nanevu
kachchubĕṭṭi yiviyĕlla gāmiḍidanamulā
(||iḍu||)
yegadānagum̐ dīside yīḍisĕnu ninnanevu
paigŏni yĕṁtaḍinerubarive nīvu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
megŏni yiṁduge nemu mĕchchidime ninnunu