ఇటువంటి దుర్గుణి నన్నెట్టు గాచితివో గాని
(॥పల్లవి॥)
ఇటువంటి దుర్గుణి నన్నెట్టు గాచితివో గాని
సటలాడేవానికి సత్య మెందు లేదు
(॥ఇటు॥)
మదనాతురునికిని మరి వివేకము లేదు
కదిసి అలసునికి కర్మము లేదు
పొదిగి యా శకునిఁకే పుణ్యపాపము లేదు
మొదలనె మూర్ఖునకు మొగ మోఁట లేదు
(॥ఇటు॥)
కొంచెపు నాస్తికునికి గురుఁడు దైవము లేఁడు
పొంచిన లోభివానికి భోగమే లేదు
యించుకంత దరిద్రున కియ్యా గొన శక్తి లేదు
చంచల చిత్తునికి నిశ్చయ మెందు లేదు
(॥ఇటు॥)
మత్తుఁడైనవానికి మరి పనులే లేవు
హత్తి వేంటకానికి దయలు లేవు
సత్తుగ శ్రీ వేంకటేశ శరణాగతుఁడ నీకు
యిత్తలఁ దాల్లిటి చీంత లిఁక నేమి లేవు
(||pallavi||)
iḍuvaṁṭi durguṇi nannĕṭṭu gāsidivo gāni
saḍalāḍevānigi satya mĕṁdu ledu
(||iḍu||)
madanādurunigini mari vivegamu ledu
kadisi alasunigi karmamu ledu
pŏdigi yā śhagunim̐ke puṇyabābamu ledu
mŏdalanĕ mūrghunagu mŏga mom̐ṭa ledu
(||iḍu||)
kŏṁchĕbu nāstigunigi gurum̐ḍu daivamu lem̐ḍu
pŏṁchina lobhivānigi bhogame ledu
yiṁchugaṁta daridruna kiyyā gŏna śhakti ledu
saṁchala sittunigi niśhchaya mĕṁdu ledu
(||iḍu||)
mattum̐ḍainavānigi mari panule levu
hatti veṁṭagānigi dayalu levu
sattuga śhrī veṁkaḍeśha śharaṇāgadum̐ḍa nīgu
yittalam̐ dālliḍi sīṁta lim̐ka nemi levu