ఇటువంటి భాగ్యములు ఇవి మీకె కలిగెను
(॥పల్లవి॥)
ఇటువంటి భాగ్యములు ఇవి మీకె కలిగెను
తటుకన నిద్దరికి దగుఁ దగునయ్యా
(॥ఇటు॥)
విననింపులైనవి వెలఁదులమాఁటలు
తనువుకింపైనది గుత్తపుఁగాఁగిలి
మనసుకింపైనవి మచ్చికైన పొందులు
పనిగొనే మగవాని భాగ్యము లివియయ్యా
(॥ఇటు॥)
గోరుమోప నింపైనవి గొప్పలైన చన్నులు
నోరికి నింపైనది నునుఁగెమ్మోవి
కొరిచూడ నింపైనది కోమలపు నెమ్మోము
సారెకు మగవానికి సంపద లివియయ్యా
(॥ఇటు॥)
నవ్వులకు నింపైనవి ననుపులచేఁతలు
జవ్వనాన కింపైనది చక్కఁదనము
యివ్వల శ్రీవేంకటేశ యీకె నిట్టెకూడితివి
నివ్వటిట్టు మగవాని నేర్పు లివియయ్యా
(||pallavi||)
iḍuvaṁṭi bhāgyamulu ivi mīgĕ kaligĕnu
taḍugana niddarigi dagum̐ dagunayyā
(||iḍu||)
vinaniṁpulainavi vĕlam̐dulamām̐ṭalu
tanuvugiṁpainadi guttabum̐gām̐gili
manasugiṁpainavi machchigaina pŏṁdulu
panigŏne magavāni bhāgyamu liviyayyā
(||iḍu||)
gorumoba niṁpainavi gŏppalaina sannulu
norigi niṁpainadi nunum̐gĕmmovi
kŏrisūḍa niṁpainadi komalabu nĕmmomu
sārĕgu magavānigi saṁpada liviyayyā
(||iḍu||)
navvulagu niṁpainavi nanubulasem̐talu
javvanāna kiṁpainadi sakkam̐danamu
yivvala śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕgūḍidivi
nivvaḍiṭṭu magavāni nerbu liviyayyā