ఇటువలెఁ జేతువా యింతిని నీవు
(॥పల్లవి॥)
ఇటువలెఁ జేతువా యింతిని నీవు
సటలెల్ల మాని యింకఁ జనవియ్య వలదా
(॥॥)
మొగమోటముననే ముదిత యెదురాడదు
యెగసక్కేలకు నీవెంత సేసినా
నగవుల సరసాల నడురే యాయను నేఁడు
జగడాలకోప దిఁకఁ జనవియ్య వలదా
(॥॥)
మిక్కిలి వాసి పట్టుకే మేర మీఱఁజాలదు
యేక్కువ తక్కువల నీవెంత నవ్వినా
తక్కుల జదురంగాలతోనే మరీఁ దెల్లవారె
చక్కని రమణికింకఁ జనవియ్యవలదా
(॥॥)
నిండిన మోహమునను నిను ధూరఁజాలదు
యిండెవెట్టి బాసలు నీవెన్ని యిచ్చినా
కొండల శ్రీవేంకటేశ కూడితి వింతటిలోన
చండివెట్టికిఁక నిట్టే చనవియ్యవలదా
(||pallavi||)
iḍuvalĕm̐ jeduvā yiṁtini nīvu
saḍalĕlla māni yiṁkam̐ janaviyya valadā
(||||)
mŏgamoḍamunane mudida yĕdurāḍadu
yĕgasakkelagu nīvĕṁta sesinā
nagavula sarasāla naḍure yāyanu nem̐ḍu
jagaḍālagoba dim̐kam̐ janaviyya valadā
(||||)
mikkili vāsi paṭṭuge mera mīṟam̐jāladu
yekkuva takkuvala nīvĕṁta navvinā
takkula jaduraṁgāladone marīm̐ dĕllavārĕ
sakkani ramaṇigiṁkam̐ janaviyyavaladā
(||||)
niṁḍina mohamunanu ninu dhūram̐jāladu
yiṁḍĕvĕṭṭi bāsalu nīvĕnni yichchinā
kŏṁḍala śhrīveṁkaḍeśha kūḍidi viṁtaḍilona
saṁḍivĕṭṭigim̐ka niṭṭe sanaviyyavaladā