ఇటువలె నున్నవి మీ యేలాటాలు
(॥పల్లవి॥)
ఇటువలె నున్నవి మీ యేలాటాలు
తటుకునఁ జెప్పితేను తగ సంతోసించేము
(॥ఇటు॥)
పొలిఁతి నవ్వితే నీవు బొమ్మల జంకించేవు
మలసి యేమైనా నాపె మర్మ మెత్తెనో
చెలరేఁగి మాటాడితే సిగ్గులు వడేవు నీవు
కలదో అందేమైనాను కారణములు
(॥ఇటు॥)
తప్పక చూచితేను తలవంచుకొంటివి
చెప్పరానిచేఁత లాడఁ జేసితివో
కప్పురాన వేసితేను గక్కన సన్న సేసేవు
చొప్పు లెత్తి గుఱుతులు చూపెనో నీమేను
(॥ఇటు॥)
వేళ యెరిఁగి మెచ్చితేవేడుక పడేవు నీవు
కోలుముందైరతు లియ్యకో లాయెనో
ఆలరి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
తాలిమి నన్నేలితివి తగనాపె చెప్పెనో
(||pallavi||)
iḍuvalĕ nunnavi mī yelāḍālu
taḍugunam̐ jĕppidenu taga saṁtosiṁchemu
(||iḍu||)
pŏlim̐ti navvide nīvu bŏmmala jaṁkiṁchevu
malasi yemainā nābĕ marma mĕttĕno
sĕlarem̐gi māḍāḍide siggulu vaḍevu nīvu
kalado aṁdemainānu kāraṇamulu
(||iḍu||)
tappaga sūsidenu talavaṁchugŏṁṭivi
sĕpparānisem̐ta lāḍam̐ jesidivo
kappurāna vesidenu gakkana sanna sesevu
sŏppu lĕtti guṟudulu sūbĕno nīmenu
(||iḍu||)
veḽa yĕrim̐gi mĕchchideveḍuga paḍevu nīvu
kolumuṁdairadu liyyago lāyĕno
ālari śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
tālimi nannelidivi taganābĕ sĕppĕno