Iduvale numdu bhaagya memani seppamgavachchu

ఇటువలె నుండు భాగ్య మేమని చెప్పఁగవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇటువలె నుండు భాగ్య మేమని చెప్పఁగవచ్చు
కుటిలకుంతలి నిన్నుఁ గోరి దక్కఁగొనెను

(॥ఇటు॥)
పెంచ పెంచ రమణికిఁ బెద్దలాయఁ గుచములు
యెంచ నెంచ గుణములు యెన్నికటాయ
ఇంచుకంత పడుచంటా నిన్నాళ్లు నుంటిమి నేఁడు
మంచముపై రతులను మరిగించె నిన్నును

(॥ఇటు॥)
చూడఁ జూడ మగువకు చూపులెల్లా వాఁడెక్కె
ఆడనాడ మాటలలో నందాలు వుట్టె
యీడుగాని పడుచంటా నెఱఁగమైతి మిన్నాళ్లు
వాడలో నెందు చూచినా వలపించె నిన్నను

(॥ఇటు॥)
కాయఁగాయ వెన్నిలాయ కాంతసెలవుల నవ్వు
సేయఁజేయ వేడుకాయ చేఁతలెల్లాను
పాయక శ్రీవేంకటేవ పడుచంటాఁ జూచితిమి
చాయలా సన్నలాఁ గూడి సాదించె నిన్నును

(||pallavi||)
iḍuvalĕ nuṁḍu bhāgya memani sĕppam̐gavachchu
kuḍilaguṁtali ninnum̐ gori dakkam̐gŏnĕnu

(||iḍu||)
pĕṁcha pĕṁcha ramaṇigim̐ bĕddalāyam̐ gusamulu
yĕṁcha nĕṁcha guṇamulu yĕnnigaḍāya
iṁchugaṁta paḍusaṁṭā ninnāḽlu nuṁṭimi nem̐ḍu
maṁchamubai radulanu marigiṁchĕ ninnunu

(||iḍu||)
sūḍam̐ jūḍa maguvagu sūbulĕllā vām̐ḍĕkkĕ
āḍanāḍa māḍalalo naṁdālu vuṭṭĕ
yīḍugāni paḍusaṁṭā nĕṟam̐gamaidi minnāḽlu
vāḍalo nĕṁdu sūsinā valabiṁchĕ ninnanu

(||iḍu||)
kāyam̐gāya vĕnnilāya kāṁtasĕlavula navvu
seyam̐jeya veḍugāya sem̐talĕllānu
pāyaga śhrīveṁkaḍeva paḍusaṁṭām̐ jūsidimi
sāyalā sannalām̐ gūḍi sādiṁchĕ ninnunu