ఇటువలె నుండవద్దా యిరవైన మోహము
(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా యిరవైన మోహము
తటుకన నీమీఁది తగులెంతోకాని
(॥ఇటు॥)
సొరిది నీమోము సారెఁ జూచియునుఁ దనియదు
తరుణి మాఁటలాడియుఁ దనియదు
సరసము లాడియాడి చాలునని తనియదు
అరుదైన మదిలోని యాస యంతోకాని
(॥ఇటు॥)
ననుపుసేసుక చెలి నవ్వియునుఁ దనియదు
తనువుసోఃకఁ బెనఁగి తనియదు
మునుకొని చేతులెత్తి మొక్కియునుఁ దనియదు
యెనసి నీపై వలపింకా నెంతోకాని
(॥ఇటు॥)
రమణఇ నీకాఁగిట రతిసేసి తనియదు
తమితో గుబ్బలనొత్తి తనియదు
జమళి శ్రీవేంకటేశ సన్నసేసి తనియదు
అమరిన సంతోసమది యెంతోకాని
(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā yiravaina mohamu
taḍugana nīmīm̐di tagulĕṁtogāni
(||iḍu||)
sŏridi nīmomu sārĕm̐ jūsiyunum̐ daniyadu
taruṇi mām̐ṭalāḍiyum̐ daniyadu
sarasamu lāḍiyāḍi sālunani taniyadu
arudaina madiloni yāsa yaṁtogāni
(||iḍu||)
nanubusesuga sĕli navviyunum̐ daniyadu
tanuvusoḥkam̐ bĕnam̐gi taniyadu
munugŏni sedulĕtti mŏkkiyunum̐ daniyadu
yĕnasi nībai valabiṁkā nĕṁtogāni
(||iḍu||)
ramaṇa̮i nīgām̐giḍa radisesi taniyadu
tamido gubbalanŏtti taniyadu
jamaḽi śhrīveṁkaḍeśha sannasesi taniyadu
amarina saṁtosamadi yĕṁtogāni