ఇటువలె నుండవద్దా యింతియై పట్టినందుకు
(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా యింతియై పట్టినందుకు
అటవోయి నన్నేలితి వంతేసి నేరుతునా
(॥ఇటు॥)
చక్కని నీవదనము సారె సారెఁ జూచుకొంటా
నక్కరతో నట్టే మాటలాడుకొంటాను
చెక్కు నొక్కి బుజముపైఁ జేతులు వేసుకొంటా
కుక్కి కుక్కి మోహమాపె కుప్పవోసెఁగా
(॥ఇటు॥)
ముంగురులు చేతఁ బట్టి మోవితేనె లానుకొంటా
అంగవించి మర్మములు అంటుకొంటాను
చెంగలించి గోరనొత్తి చిరునవ్వు నవ్వుకొంటా
వెంగలిరతు లెల్లాను వెద వెట్టెఁగా
(॥ఇటు॥)
చల్లనైన నీవురము చన్నుల నదుముకొంటా
వొల్లనే కాఁగిటఁ గూడి వుబ్బుకొంటాను
మెల్లనె శ్రీవేంకటేశ మేలము లాడుకొంట
వెల్లవిరిగా వేడుక వెద వెట్టెఁగా
(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā yiṁtiyai paṭṭinaṁdugu
aḍavoyi nannelidi vaṁtesi nerudunā
(||iḍu||)
sakkani nīvadanamu sārĕ sārĕm̐ jūsugŏṁṭā
nakkarado naṭṭe māḍalāḍugŏṁṭānu
sĕkku nŏkki bujamubaim̐ jedulu vesugŏṁṭā
kukki kukki mohamābĕ kuppavosĕm̐gā
(||iḍu||)
muṁgurulu sedam̐ baṭṭi movidenĕ lānugŏṁṭā
aṁgaviṁchi marmamulu aṁṭugŏṁṭānu
sĕṁgaliṁchi goranŏtti sirunavvu navvugŏṁṭā
vĕṁgaliradu lĕllānu vĕda vĕṭṭĕm̐gā
(||iḍu||)
sallanaina nīvuramu sannula nadumugŏṁṭā
vŏllane kām̐giḍam̐ gūḍi vubbugŏṁṭānu
mĕllanĕ śhrīveṁkaḍeśha melamu lāḍugŏṁṭa
vĕllavirigā veḍuga vĕda vĕṭṭĕm̐gā