Iduvale numdavaddaa yiddari pomdu

ఇటువలె నుండవద్దా యిద్దరి పొందు
Language

(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా యిద్దరి పొందు
తటుకన నీడేరెఁ దనకు నాకిపుడు

(॥॥)
నేరుపు గలిగితేను నేస్తము లొనగూడు
మేరతోనే వుండితేను మించు వేడుక
వోరుచుకొంటేను వొద్దికౌను సరసము
తారుకాణలాయ నాకుఁ దనకు నేఁడిపుడు

(॥॥)
చనవులు నెరపితేఁ జవులువుట్టుఁ గాఁపురము
ననువులు జరిపితే నవ్వులురేఁగు
చెనకులు బలిసితే సిగ్గులు మొదలౌను
మనసులు సరిదాఁ కెఁ దనకు నాకిపుడు

(॥॥)
అంటిముట్టి పెనఁగితే నాయములు గరఁగును
జంటవాయకుండితేను సతమౌ మేలు
ఇంటిలోన శ్రీవెంకటేశుఁడు తా నన్నుఁ గూడె
దంటతనా లుప్పతిల్లెఁ దనకు నాకిపుడు

(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā yiddari pŏṁdu
taḍugana nīḍerĕm̐ danagu nāgibuḍu

(||||)
nerubu galigidenu nestamu lŏnagūḍu
meradone vuṁḍidenu miṁchu veḍuga
vorusugŏṁṭenu vŏddigaunu sarasamu
tārugāṇalāya nāgum̐ danagu nem̐ḍibuḍu

(||||)
sanavulu nĕrabidem̐ javuluvuṭṭum̐ gām̐puramu
nanuvulu jaribide navvulurem̐gu
sĕnagulu baliside siggulu mŏdalaunu
manasulu saridām̐ kĕm̐ danagu nāgibuḍu

(||||)
aṁṭimuṭṭi pĕnam̐gide nāyamulu garam̐gunu
jaṁṭavāyaguṁḍidenu sadamau melu
iṁṭilona śhrīvĕṁkaḍeśhum̐ḍu tā nannum̐ gūḍĕ
daṁṭadanā luppadillĕm̐ danagu nāgibuḍu