ఇటువలె నుండవద్దా ఇంతుల మన్నించితేను
(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా ఇంతుల మన్నించితేను
తటుకన మెచ్చిరి యీ తరుణులు నిన్నును
(॥ఇటు॥)
కమ్మరఁ గమ్మర నాపెకతలే చెప్పేవు
బొమ్మల చిత్తరువాపెఁ బోలె ననేవు
పిమ్మటిచెలుల నాపెపేరంటి లాలించేవు
యిమ్ముల నాకెమీఁద నేఁడెంత గద్దో వలపు
(॥ఇటు॥)
నెలకొన్న యాపెమెడ నీవే సింగారించేవు
అలరులాకె కింపైనవే కోరేవు
మలసి యాపెయాడేటి మాటలే నేర్చుకొనేవు
యెలమి నాకెమీఁద నెంతగద్దో వలపు
(॥ఇటు॥)
అడుగులకు మడుగులాపెకిట్టే పరచేవు
యెడయకాపె కాఁగిట నెనశుండేవు
అడరి శ్రీవేంకటేశ అందుకే మమ్మేలితివి
యిడుపుల నాకెమీఁద నెంతగద్దో వలపు
(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā iṁtula manniṁchidenu
taḍugana mĕchchiri yī taruṇulu ninnunu
(||iḍu||)
kammaram̐ gammara nābĕgadale sĕppevu
bŏmmala sittaruvābĕm̐ bolĕ nanevu
pimmaḍisĕlula nābĕberaṁṭi lāliṁchevu
yimmula nāgĕmīm̐da nem̐ḍĕṁta gaddo valabu
(||iḍu||)
nĕlagŏnna yābĕmĕḍa nīve siṁgāriṁchevu
alarulāgĕ kiṁpainave korevu
malasi yābĕyāḍeḍi māḍale nersugŏnevu
yĕlami nāgĕmīm̐da nĕṁtagaddo valabu
(||iḍu||)
aḍugulagu maḍugulābĕgiṭṭe parasevu
yĕḍayagābĕ kām̐giḍa nĕnaśhuṁḍevu
aḍari śhrīveṁkaḍeśha aṁduge mammelidivi
yiḍubula nāgĕmīm̐da nĕṁtagaddo valabu