Iduvale numdavaddaa iddari mee vorabulu

ఇటువలె నుండవద్దా ఇద్దరి మీ వొరపులు
Language

(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా ఇద్దరి మీ వొరపులు
ఘటిఇంచే మీ వేడుకలు దొరసునయ్యా

(॥ఇటు॥)
చందురునివంటి మోము సంపెంగ వంటిది ముక్కు
కుందణమువంటిది మేను కోమలికిని
కందువల రూపురేఖ కడుఁగడుఁ జక్కనిది
అందము లెంచితే నీకు నాకెకుఁ దగునయ్యా

(॥ఇట్టు॥)
చీఁకటివంటి తురుము సింహమువంటి నడుము
పోఁకలవంటి చన్నులు పొలఁతికిని
వేఁకపుఁ బిరుఁదుతోడ వింతసింగారము లవి
యేఁకటతో నీకు నాకె కిట్టె తగునయ్యా

(॥ఇటు॥)
అంచవంటి నడలది అంగజు దీమువంటిది
మించుఁదీగెవంటి దలమేలుమంగ
యెంచఁగ శ్రీవేంకటేశ యేలితివి జవరాలి
అంచెల నీపెకు నీకు నన్నిటా దగునయ్యా

(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā iddari mī vŏrabulu
ghaḍiiṁche mī veḍugalu dŏrasunayyā

(||iḍu||)
saṁdurunivaṁṭi momu saṁpĕṁga vaṁṭidi mukku
kuṁdaṇamuvaṁṭidi menu komaligini
kaṁduvala rūburekha kaḍum̐gaḍum̐ jakkanidi
aṁdamu lĕṁchide nīgu nāgĕgum̐ dagunayyā

(||iṭṭu||)
sīm̐kaḍivaṁṭi turumu siṁhamuvaṁṭi naḍumu
pom̐kalavaṁṭi sannulu pŏlam̐tigini
vem̐kabum̐ birum̐dudoḍa viṁtasiṁgāramu lavi
yem̐kaḍado nīgu nāgĕ kiṭṭĕ tagunayyā

(||iḍu||)
aṁchavaṁṭi naḍaladi aṁgaju dīmuvaṁṭidi
miṁchum̐dīgĕvaṁṭi dalamelumaṁga
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yelidivi javarāli
aṁchĕla nībĕgu nīgu nanniḍā dagunayyā