Iduvale nee vumdide nettu delusu

ఇటువలె నీ వుండితే నెట్టు దెలుసు
Language

(॥పల్లవి॥)
ఇటువలె నీ వుండితే నెట్టు దెలుసు
ఘటనలు పెరచోటఁ గానవచ్చీ నపుడు

(॥ఇటు॥)
మాటలెల్లా మంచివే నీమన సెట్లానో కాని
యీటున నీమోహము యెట్టు దెలుసు
ఆఁటదాని నొకతె నీయండఁ బెట్టి చూడఁగాను
గాఁటమున నీబుద్దులు కానవచ్చీ నపుడు

(॥ఇటు॥)
గుట్టులెల్లా మంచివే గుణమెట్లానోకాని
యిట్టి నిన్ను వొక్కమాటే యెట్టు దెలుసు
అట్టే వొకతెచే నీకు ఆయము లంటింపించగా
గట్టియైన నీ పంతాలు కానవచ్చీ నపుడు

(॥ఇటు॥)
కలసితిని మంచిది కడమెట్లానో కాని
యెలమి శ్రీ వేంకటేశ యెట్టు దెలుసు
అలమేలుమంగను నేను అవ్వల నెవ్వతెనైనాఁ
గలయకుండితే నిన్నుఁ గానవచ్చీఁ నపుడు

(||pallavi||)
iḍuvalĕ nī vuṁḍide nĕṭṭu dĕlusu
ghaḍanalu pĕrasoḍam̐ gānavachchī nabuḍu

(||iḍu||)
māḍalĕllā maṁchive nīmana sĕṭlāno kāni
yīḍuna nīmohamu yĕṭṭu dĕlusu
ām̐ṭadāni nŏgadĕ nīyaṁḍam̐ bĕṭṭi sūḍam̐gānu
gām̐ṭamuna nībuddulu kānavachchī nabuḍu

(||iḍu||)
guṭṭulĕllā maṁchive guṇamĕṭlānogāni
yiṭṭi ninnu vŏkkamāḍe yĕṭṭu dĕlusu
aṭṭe vŏgadĕse nīgu āyamu laṁṭiṁpiṁchagā
gaṭṭiyaina nī paṁtālu kānavachchī nabuḍu

(||iḍu||)
kalasidini maṁchidi kaḍamĕṭlāno kāni
yĕlami śhrī veṁkaḍeśha yĕṭṭu dĕlusu
alamelumaṁganu nenu avvala nĕvvadĕnainām̐
galayaguṁḍide ninnum̐ gānavachchīm̐ nabuḍu