ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను
(॥పల్లవి॥)
ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను
తటుకన నీ కీరితి వొగడుదురు తలకొని యిందరును
(॥ఇటు॥)
సురాసురగంధర్వయక్షులు మిమ్ముఁ దెలియఁగలేరు
పరాశరాదులు మీరూపు భావించఁగలేరు
నరు లెరుఁగుదురా మిమ్ము నారాయణ నీవే సులభఁడవై
కరీంద్రుఁ గాచినయటువలెఁ గాతువు గాక
(॥ఇటు॥)
సనాతనబహువేదశాస్త్రంబులు మిమ్ముఁ నుతింపలేవు
అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించఁగలేవు
తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను
వినోదముగఁ గాచినయటువలె వెసఁ గాతువు గాక
(॥ఇటు॥)
రమాసతి నీళామహిరామలు మీతలఁ పెఱంగరు
సమేతులైన శేషాదులు మీజాడ మీరలేరు
తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంకటేశ
నమోనమో యని మొక్కంగాఁ ననుఁగాతువు గాక
(||pallavi||)
iḍulaidem̐ buṇyamu nīgu yidi vubagāraṁbaunu
taḍugana nī kīridi vŏgaḍuduru talagŏni yiṁdarunu
(||iḍu||)
surāsuragaṁdharvayakṣhulu mimmum̐ dĕliyam̐galeru
parāśharādulu mīrūbu bhāviṁcham̐galeru
naru lĕrum̐gudurā mimmu nārāyaṇa nīve sulabham̐ḍavai
karīṁdrum̐ gāsinayaḍuvalĕm̐ gāduvu gāga
(||iḍu||)
sanādanabahuvedaśhāstraṁbulu mimmum̐ nudiṁpalevu
anaṁtayajñaṁbulu mimmu naḍu sādhiṁcham̐galevu
tanūdharu lĕṁtaḍivāru dāmodara nīve ahalyanu
vinodamugam̐ gāsinayaḍuvalĕ vĕsam̐ gāduvu gāga
(||iḍu||)
ramāsadi nīḽāmahirāmalu mīdalam̐ pĕṟaṁgaru
samedulaina śheṣhādulu mījāḍa mīraleru
tamomayu liṁdarunu dharaṇidhara śhrīveṁkaḍeśha
namonamo yani mŏkkaṁgām̐ nanum̐gāduvu gāga