Idulaane nee suddulu yemainaa samtugomduvu

ఇటులానే నీ సుద్దులు యేమైనా సంటుకొందువు
Language

(॥పల్లవి॥)
ఇటులానే నీ సుద్దులు యేమైనా సంటుకొందువు
కటకటా యిటువలెఁ గాకు సేయవచ్చునా

(॥ఇటు॥)
కోమలి చన్నులమీఁది కుంకుమగందపుఁబూత
ఆముకొని పచ్చడాన నంటుకున్నది
గామిడితనాన నాపైఁ గప్పితి వెగసక్కేన
యేమిసేతు నిన్ను నిందు కెవ్వరికిఁ జెప్పుదు

(॥ఇటు॥)
తొయ్యలికొప్పువిరులు తొరలినసవరము
కొయ్యతనాన ముడుచుకొంటివి నీవు
యియ్యెడ నేమరిపాటు ఇటు నాకు ముడిచితి
నియ్యంత నీవెఱఁగవు నిన్నిఁక నేమందును

(॥ఇటు॥)
చెలివట్టుకుండినచేతిలోలి వీడెము
లలిఁ గైకొని నీతమ్ములము వెట్టేవు
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి విఁక నిన్ను గరిసించనేఁటికి

(||pallavi||)
iḍulāne nī suddulu yemainā saṁṭugŏṁduvu
kaḍagaḍā yiḍuvalĕm̐ gāgu seyavachchunā

(||iḍu||)
komali sannulamīm̐di kuṁkumagaṁdabum̐būda
āmugŏni pachchaḍāna naṁṭugunnadi
gāmiḍidanāna nābaim̐ gappidi vĕgasakkena
yemisedu ninnu niṁdu kĕvvarigim̐ jĕppudu

(||iḍu||)
tŏyyaligŏppuvirulu tŏralinasavaramu
kŏyyadanāna muḍusugŏṁṭivi nīvu
yiyyĕḍa nemaribāḍu iḍu nāgu muḍisidi
niyyaṁta nīvĕṟam̐gavu ninnim̐ka nemaṁdunu

(||iḍu||)
sĕlivaṭṭuguṁḍinasediloli vīḍĕmu
lalim̐ gaigŏni nīdammulamu vĕṭṭevu
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi vim̐ka ninnu garisiṁchanem̐ṭigi