ఇటు చేసిన దేవర నేమని మెత్తు నే నిఁక
(॥పల్లవి॥)
ఇటు చేసిన దేవర నేమని మెత్తు నే నిఁక
కటకటా నే నిందుకే కరఁగుదురా
(॥॥)
తనువులే వేరులై తలఁపొక్కటైనమీఁద
ననిచి నిన్నేమనినా నన్ను నంటేపో
వెనుకొని నీవు రానివేళ గోపించఁబోతే
జునిగి నాగుండె నాకే చుఱుకనురా
(॥॥)
వయసులు సమములై వావులు గూడినమీఁద
నయమై నీ మేలెల్లా నామేలే పో
ప్రియము చెప్పేవేళ పెనఁగఁగఁబోయి నేనే
దయదలఁచి నీమీఁదఁ దమకింతురా
(॥॥)
కాఁకల నిందాఁకాఁ బొంది కాఁగిటఁ గూడినమీఁద
యేఁకట నీ కెంతగల్లా నిది నాదేపో
సోఁకుల శ్రీవేంకటేశ చొక్కించితివి నన్ను
వేఁకపు గుబ్బలముద్ర వేసితి నీపైరా
(||pallavi||)
iḍu sesina devara nemani mĕttu ne nim̐ka
kaḍagaḍā ne niṁduge karam̐gudurā
(||||)
tanuvule verulai talam̐pŏkkaḍainamīm̐da
nanisi ninnemaninā nannu naṁṭebo
vĕnugŏni nīvu rāniveḽa gobiṁcham̐bode
junigi nāguṁḍĕ nāge suṟuganurā
(||||)
vayasulu samamulai vāvulu gūḍinamīm̐da
nayamai nī melĕllā nāmele po
priyamu sĕppeveḽa pĕnam̐gam̐gam̐boyi nene
dayadalam̐si nīmīm̐dam̐ damagiṁturā
(||||)
kām̐kala niṁdām̐kām̐ bŏṁdi kām̐giḍam̐ gūḍinamīm̐da
yem̐kaḍa nī kĕṁtagallā nidi nādebo
som̐kula śhrīveṁkaḍeśha sŏkkiṁchidivi nannu
vem̐kabu gubbalamudra vesidi nībairā