Idu ninu deliyamga emtadivaaramu

ఇటు నిను దెలియఁగ ఎంతటివారము
Language

(॥పల్లవి॥)
ఇటు నిను దెలియఁగ ఎంతటివారము
తటుకున నాసలఁ దగులుట గాక

(॥ఇటు॥)
నానామూర్తులు నగధర నీరూపు
యే నెలవుల నిన్నెటువలెఁ దలఁచుట
పూని నీ భావము పొందుగాఁ జెప్పఁగా
వీనులు చల్లఁగా వినుటే కాక

(॥ఇటు॥)
పెక్కు నామములు బిరుదు లనంతము-
లెక్కడ గొలదిగ నెన్నెని పొగడుట
యిక్కువ సేసుక యిందులో నొకటి
పక్కన నొకమరి పలుకుట గాక

(॥ఇటు॥)
వేవేలు గలవు నీ విహార భూములు
యేవిధమున నెందెందని తిరుగుట
శ్రీవేంకటేశా నీ శృంగారమెల్లను
సేవించి ముదమునఁ జెలఁగుట గాక

(||pallavi||)
iḍu ninu dĕliyam̐ga ĕṁtaḍivāramu
taḍuguna nāsalam̐ daguluḍa gāga

(||iḍu||)
nānāmūrdulu nagadhara nīrūbu
ye nĕlavula ninnĕḍuvalĕm̐ dalam̐suḍa
pūni nī bhāvamu pŏṁdugām̐ jĕppam̐gā
vīnulu sallam̐gā vinuḍe kāga

(||iḍu||)
pĕkku nāmamulu birudu lanaṁtamu-
lĕkkaḍa gŏladiga nĕnnĕni pŏgaḍuḍa
yikkuva sesuga yiṁdulo nŏgaḍi
pakkana nŏgamari paluguḍa gāga

(||iḍu||)
vevelu galavu nī vihāra bhūmulu
yevidhamuna nĕṁdĕṁdani tiruguḍa
śhrīveṁkaḍeśhā nī śhṛṁgāramĕllanu
seviṁchi mudamunam̐ jĕlam̐guḍa gāga