Idu neegu sadamaide nemi seyavalasuno

ఇటు నీకు సతమైతే నేమి సేయవలసునో
Language

(॥పల్లవి॥)
ఇటు నీకు సతమైతే నేమి సేయవలసునో
తటుకునను నివి యెపుడుఁ దలపోయవలసె

(॥ఇటు॥)
చెలఁగి నీ వొకనాఁడు సేసినపొందుకుఁగాను
కులికి నీవు రాకుండఁగాఁ గోపగించవలసె
సొలసి నీ వలవోకఁ జూచిన చూపుల భ్రమసి
బలిమి నినుఁ బట్టుకొని పచ్చి సేయవలసె

(॥ఇటు॥)
వేడుకలకు నీవు నాకు విడె మియ్యఁగా మరిగి
జాడ నీవు పరాకైతే జంకించవలసె
నాఁడు నీ వొకమాఁటు నవ్వు నవ్వఁగఁ జొక్కి
కూడుమనుచు నిను సారెఁ గొంగుముట్టవలసె

(॥ఇటు॥)
గరిమెతో నను మెచ్చి కాఁగిలించినందుకుఁగా
సురతముల నిను నొత్తి సూడువట్ట వలసె
సిరుల శ్రీవేంకటేశ సేసవెట్టినందుకుఁగా
యిరవుకొని నీవురము యెక్కివుండవలసె

(||pallavi||)
iḍu nīgu sadamaide nemi seyavalasuno
taḍugunanu nivi yĕbuḍum̐ dalaboyavalasĕ

(||iḍu||)
sĕlam̐gi nī vŏganām̐ḍu sesinabŏṁdugum̐gānu
kuligi nīvu rāguṁḍam̐gām̐ gobagiṁchavalasĕ
sŏlasi nī valavogam̐ jūsina sūbula bhramasi
balimi ninum̐ baṭṭugŏni pachchi seyavalasĕ

(||iḍu||)
veḍugalagu nīvu nāgu viḍĕ miyyam̐gā marigi
jāḍa nīvu parāgaide jaṁkiṁchavalasĕ
nām̐ḍu nī vŏgamām̐ṭu navvu navvam̐gam̐ jŏkki
kūḍumanusu ninu sārĕm̐ gŏṁgumuṭṭavalasĕ

(||iḍu||)
garimĕdo nanu mĕchchi kām̐giliṁchinaṁdugum̐gā
suradamula ninu nŏtti sūḍuvaṭṭa valasĕ
sirula śhrīveṁkaḍeśha sesavĕṭṭinaṁdugum̐gā
yiravugŏni nīvuramu yĕkkivuṁḍavalasĕ