Idu neegu magamdaide nidi yalavaadulaa

ఇటు నీకు మగఁడైతే నిది యలవాటులా
Language

(॥పల్లవి॥)
ఇటు నీకు మగఁడైతే నిది యలవాటులా
కటకటా జంకించేవు కసుగందదా

(॥ఇటు॥)
సన్నలకు లోనైన జవ్వను మగవాని
కన్నుల నింత చూచితే కాఁడి పారదా
పిన్నదానవైనుండి బెట్టిమాట లాడేవు
చెన్నుఁడాతని వీనులు చీదరలు గొనవా

(॥ఇటు॥)
యేఁకటతోనుండేటి ఇచ్చకపురమణుని
కాఁకలనవ్వు నవ్వితే గరివడదా
వీఁకతో నీ నాయకుని వెసఁ జన్నుల నొత్తేవు
తేఁకువ నాతనిమే నొద్దికఁ గాయగావదా

(॥ఇటు॥)
చిత్తము కోమలమైన శ్రీవేంకటేశ్వరుని
తత్తరించి పొందితిని తమి రేఁగదా
యిత్తర నన్నేలినాఁడు యిందరిలోపల నేఁడు
కొత్తలు సేసితే మతి గుబ్బతిల్లదా

(||pallavi||)
iḍu nīgu magam̐ḍaide nidi yalavāḍulā
kaḍagaḍā jaṁkiṁchevu kasugaṁdadā

(||iḍu||)
sannalagu lonaina javvanu magavāni
kannula niṁta sūside kām̐ḍi pāradā
pinnadānavainuṁḍi bĕṭṭimāḍa lāḍevu
sĕnnum̐ḍādani vīnulu sīdaralu gŏnavā

(||iḍu||)
yem̐kaḍadonuṁḍeḍi ichchagaburamaṇuni
kām̐kalanavvu navvide garivaḍadā
vīm̐kado nī nāyaguni vĕsam̐ jannula nŏttevu
tem̐kuva nādanime nŏddigam̐ gāyagāvadā

(||iḍu||)
sittamu komalamaina śhrīveṁkaḍeśhvaruni
tattariṁchi pŏṁdidini tami rem̐gadā
yittara nannelinām̐ḍu yiṁdarilobala nem̐ḍu
kŏttalu seside madi gubbadilladā