ఇటు గాని వొడఁబాటు లేమి బాఁతి అట
(॥పల్లవి॥)
ఇటు గాని వొడఁబాటు లేమి బాఁతి అట-
మటము లేల నన్ను మన్నించు మనవే
(॥ఇటుగాని॥)
నగవు రప్పించినదే నయమైన సరసము
మగఁడు మన్నించినదే మగువ
జగడము దీర్చినదే సమ్మతించిన తగవు
మొగ మోడించినదే మునుకొన్న చెలిమి
(॥ఇటుగా॥)
యెరవు లేకుండినదే యింపైన చుట్టరికము
సరవి దప్పనిదే దొరతనము
విరసము లేనిదే వేడుకతోడిబ్రదుకు
తరితీపై వుండినదే తమకపువలపు
(॥ఇటుగా॥)
మనసు గరఁచినదే మచ్చికైన కౌఁగిలి
తనివిఁ బొదించినదే తగినవిందు
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో నన్ను నేఁడు
వినయముతో నున్నదే వెలలేని గుణము
(||pallavi||)
iḍu gāni vŏḍam̐bāḍu lemi bām̐ti aḍa-
maḍamu lela nannu manniṁchu manave
(||iḍugāni||)
nagavu rappiṁchinade nayamaina sarasamu
magam̐ḍu manniṁchinade maguva
jagaḍamu dīrsinade sammadiṁchina tagavu
mŏga moḍiṁchinade munugŏnna sĕlimi
(||iḍugā||)
yĕravu leguṁḍinade yiṁpaina suṭṭarigamu
saravi dappanide dŏradanamu
virasamu lenide veḍugadoḍibradugu
taridībai vuṁḍinade tamagabuvalabu
(||iḍugā||)
manasu garam̐sinade machchigaina kaum̐gili
tanivim̐ bŏdiṁchinade taginaviṁdu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannu nem̐ḍu
vinayamudo nunnade vĕlaleni guṇamu