ఇదియేమి చిత్రమో య(యె?)ఱఁగమయ్యా
(॥పల్లవి॥)
ఇదియేమి చిత్రమో య(యె?)ఱఁగమయ్యా
సుదతి భావము నేఁడు చూతువు రావయ్యా
(॥ఇది॥)
వలపుల మొలకలు వనితచన్ను మొనలు
నెలకొన్నచెమటలు నినుపునీరు
పెలుచుజవ్వనమునఁ బెరుగఁగాఁ బెరుగఁగా
అలరి తామర మొగ్గలాయనయ్యూ
(॥ఇది॥)
తలపోఁతతీగెలు కరుణికొప్పునెరులు
చెలఁగి కస్తూరిబొట్టు సేసినపొడి
కలికిచక్కఁదఁనాల గడుముదిరి ముదిరి
మెలుపున గండుతమ్మెద లాయనయ్యా
(॥ఇది॥)
రతియమృతఫలాలు రమణికెమ్మోవులు
తతిఁ దరితీపులు తమకములు
యితవై శ్రీవేంకటేశ యింతి నీవు గూడఁ గూడ
కతలుగాఁ బగడంపుగను లాయనాయ్యా
(||pallavi||)
idiyemi sitramo ya(yĕ?)ṟam̐gamayyā
sudadi bhāvamu nem̐ḍu sūduvu rāvayyā
(||idi||)
valabula mŏlagalu vanidasannu mŏnalu
nĕlagŏnnasĕmaḍalu ninubunīru
pĕlusujavvanamunam̐ bĕrugam̐gām̐ bĕrugam̐gā
alari tāmara mŏggalāyanayyū
(||idi||)
talabom̐tadīgĕlu karuṇigŏppunĕrulu
sĕlam̐gi kastūribŏṭṭu sesinabŏḍi
kaligisakkam̐dam̐nāla gaḍumudiri mudiri
mĕlubuna gaṁḍudammĕda lāyanayyā
(||idi||)
radiyamṛtaphalālu ramaṇigĕmmovulu
tadim̐ daridībulu tamagamulu
yidavai śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍam̐ gūḍa
kadalugām̐ bagaḍaṁpuganu lāyanāyyā