ఇదియే వేళవచ్చె నెచ్చరించితిమి నీకు
(॥పల్లవి॥)
ఇదియే వేళవచ్చె నెచ్చరించితిమి నీకు
వుదుటుఁ గోపాననేల వూరకున్న దానవే
(॥ఇది॥)
వన్నెలెల్లా నీసొమ్ము వాసులెల్లా నీఇరవు
సన్నలు సేయఁజెల్లుసే సరసునితో
చన్నులు నీకు గొప్పలు చనవు నీకే కలదు
యెన్ని సేఁతలు చేసినా యియ్యకోలే పతికి
(॥ఇది॥)
చక్కఁదనము నీరూపు జవ్వనము నీకు దాపు
అక్కరతో నవ్వఁజెల్లు నన్నిటా నేఁడు
చిక్కనిమాటలు నీవి చిమ్ముఁజూపు నీధనము
ఇక్కువ లెంతంటినాను ఇయ్యకోలె పతికి
(॥ఇది॥)
పంతమే నీకు గుణము భావమే నీకు బలువు
చెంతల శ్రీవేంకటేశు సేవ సేయవే
యింతలో నాతఁడే నిన్ను నెనసె నీవు జాణవు
యెంతకెంత చొక్కించినాను యియ్యకోలే పతికి
(||pallavi||)
idiye veḽavachchĕ nĕchchariṁchidimi nīgu
vuduḍum̐ gobānanela vūragunna dānave
(||idi||)
vannĕlĕllā nīsŏmmu vāsulĕllā nīiravu
sannalu seyam̐jĕlluse sarasunido
sannulu nīgu gŏppalu sanavu nīge kaladu
yĕnni sem̐talu sesinā yiyyagole padigi
(||idi||)
sakkam̐danamu nīrūbu javvanamu nīgu dābu
akkarado navvam̐jĕllu nanniḍā nem̐ḍu
sikkanimāḍalu nīvi simmum̐jūbu nīdhanamu
ikkuva lĕṁtaṁṭinānu iyyagolĕ padigi
(||idi||)
paṁtame nīgu guṇamu bhāvame nīgu baluvu
sĕṁtala śhrīveṁkaḍeśhu seva seyave
yiṁtalo nādam̐ḍe ninnu nĕnasĕ nīvu jāṇavu
yĕṁtagĕṁta sŏkkiṁchinānu yiyyagole padigi