Idiye saalunu nemi nanagure

ఇదియే చాలును నేమి ననకురే
Language

(॥పల్లవి॥)
ఇదియే చాలును నేమి ననకురే
కదిసిన ప్రాణము కామిని నాకు

(॥ఇది॥)
మాఁటలలోపలిమర్మము వేరే
గాఁటపుసతి పలుకఁగనీరే
తేటలకన్నులద్రిష్టులు వేరే
సూటిగ నెట్టయినఁ జూడఁగనీరే

(॥ఇది ॥)
అంగములోపలిఆయము వేరే
అంగన చేయివేయఁగనీరే
రంగులసరసపురచనలు వేరే
జంగిలినవ్వులు చల్లఁగనీరే

(॥ఇది॥)
సన్నలలోపలిచనవులు వేరే
చన్నుల నోరయుచుఁజననీరే
యిన్నిట శ్రీవేంకటేశుఁడ యీసతి
వున్నది వురమున నుండఁగనీరే

(||pallavi||)
idiye sālunu nemi nanagure
kadisina prāṇamu kāmini nāgu

(||idi||)
mām̐ṭalalobalimarmamu vere
gām̐ṭabusadi palugam̐ganīre
teḍalagannuladriṣhṭulu vere
sūḍiga nĕṭṭayinam̐ jūḍam̐ganīre

(||idi ||)
aṁgamulobaliāyamu vere
aṁgana seyiveyam̐ganīre
raṁgulasarasaburasanalu vere
jaṁgilinavvulu sallam̐ganīre

(||idi||)
sannalalobalisanavulu vere
sannula norayusum̐jananīre
yinniḍa śhrīveṁkaḍeśhum̐ḍa yīsadi
vunnadi vuramuna nuṁḍam̐ganīre