Idiye saalu naagu yedaleni vegadela

ఇదియే చాలు నాకు యేడలేని వెగటేల
Language

(॥పల్లవి॥)
ఇదియే చాలు నాకు యేడలేని వెగటేల
పదిటి కొకమాఁటైనాఁ బలుకకుండేవా

(॥ఇది॥)
మంతనాన నీతోను మారుకొని మాటాడఁగ
పంతము వచ్చెనా నేఁడు పలుమారును
చింతగోడఁ దలవంచి చెక్కుచేతితో నుండఁగ
కొంతైనా నన్ను వేఁడుకొనకుండేవా

(॥ఇది॥)
గద్దించి నీతో నేను కమ్మటినిఁ బెనఁగఁగ
పెద్దరికమా నాకుఁ బెచ్చువెరిగి
కొద్దితోడఁ బానుపుపై గుట్టుసేసుకుండఁగాను
బుద్ది దలఁచుకొనైనా పొందకుండేవా

(॥ఇది॥)
నెలవై కాఁగిటిలోను నిన్ను నలయించఁగాను
కలిగెనా మేలుశ్రీవేంకటవిభుఁడా
చెలఁగి రాజసముతో చేరి సంగడి నుండఁగ
నలువంక నాతోనే నవ్వకుండేవా

(||pallavi||)
idiye sālu nāgu yeḍaleni vĕgaḍela
padiḍi kŏgamām̐ṭainām̐ balugaguṁḍevā

(||idi||)
maṁtanāna nīdonu mārugŏni māḍāḍam̐ga
paṁtamu vachchĕnā nem̐ḍu palumārunu
siṁtagoḍam̐ dalavaṁchi sĕkkusedido nuṁḍam̐ga
kŏṁtainā nannu vem̐ḍugŏnaguṁḍevā

(||idi||)
gaddiṁchi nīdo nenu kammaḍinim̐ bĕnam̐gam̐ga
pĕddarigamā nāgum̐ bĕchchuvĕrigi
kŏddidoḍam̐ bānububai guṭṭusesuguṁḍam̐gānu
buddi dalam̐sugŏnainā pŏṁdaguṁḍevā

(||idi||)
nĕlavai kām̐giḍilonu ninnu nalayiṁcham̐gānu
kaligĕnā meluśhrīveṁkaḍavibhum̐ḍā
sĕlam̐gi rājasamudo seri saṁgaḍi nuṁḍam̐ga
naluvaṁka nādone navvaguṁḍevā