Idiye naagu mada midi vradamu

ఇదియె నాకు మత మిది వ్రతము
Language

(॥పల్లవి॥)
ఇదియె నాకు మత మిది వ్రతము
వుదుట్ల కర్మము వొల్లా నిఁకను

(॥ఇదియె॥)
నిపుణత హరి నే నిను శరణునుటె
తపములు జపములు ధర్మములు
నేపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యము లొల్లా నే యింకను

(॥ఇదియె॥)
హరి నీ దాసుఁడ నను కొనుటే నా
పరమును యిహమును భాగ్యమును
ధర నీ మాయల తప్పుఁదెరువులను
వొరగి సుకృతము లొల్లా నే యింకను

(॥ఇదియె॥)
నారాయణ నీ నామము దలఁచుట
సారపుఁ జదువులు శాస్త్రములు
యీరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ గొలిచితి
వూరక యితరము లొల్లా నే యింకను

(||pallavi||)
idiyĕ nāgu mada midi vradamu
vuduṭla karmamu vŏllā nim̐kanu

(||idiyĕ||)
nibuṇada hari ne ninu śharaṇunuḍĕ
tabamulu jabamulu dharmamulu
nebamuna sagalamu nīve segŏnu
vubamala puṇyamu lŏllā ne yiṁkanu

(||idiyĕ||)
hari nī dāsum̐ḍa nanu kŏnuḍe nā
paramunu yihamunu bhāgyamunu
dhara nī māyala tappum̐dĕruvulanu
vŏragi sukṛtamu lŏllā ne yiṁkanu

(||idiyĕ||)
nārāyaṇa nī nāmamu dalam̐suḍa
sārabum̐ jaduvulu śhāstramulu
yīrīdi śhrī veṁkaḍeśha ninnum̐ gŏlisidi
vūraga yidaramu lŏllā ne yiṁkanu