Idiye kaavalenani taam gaigoni yichchagimchuvaamde ghanumdu

ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు
Language

(॥పల్లవి॥)
ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు
వదలకురో హరిదాసుల మతమిది వర్ణించెద నో వివేకులాలా

(॥ఇది॥)
దేవుఁడు గలఁడని మదిలోఁ దెలియుటే జన్మఫలంబు
తావుగ నాతని నెప్పుడుఁ దలఁచుటే తనభాగ్యము
శ్రీవైష్ణవధర్మము దప్పక చెలఁగుటయే వైభవము
దేవతాంతరంబులన్నియు మానినదియే సుకృతంబు

(॥ఇది॥)
కామక్రోధము లుజ్జగించుటయే కల్యాణానుభవము
చేముంచి పాపము సేయక మానుటే చెప్పఁగ లాభము
నేమముతోడుత విరక్తుఁడగుటే నిర్మలానందము
వేమరు నాచార్యసేవ సేయుటే విచారింపఁగ దాఁచిన ధనము

(॥ఇది॥)
ప్రకృతివికారములకుఁ జొరకుండుటే పరమమైన సాత్వికము
సకలబంధములఁ బెడఁ బాసినదే సామ్రాజ్యపదము
ప్రకటింపఁగ నలమేలుమంగకును పతియగు శ్రీవేంకటవిభుని
అకలంకుఁడై కొలిచియుండుటే యనంతమహిమాతిశయంబు

(||pallavi||)
idiye kāvalĕnani tām̐ gaigŏni yichchagiṁchuvām̐ḍe ghanum̐ḍu
vadalaguro haridāsula madamidi varṇiṁchĕda no vivegulālā

(||idi||)
devum̐ḍu galam̐ḍani madilom̐ dĕliyuḍe janmaphalaṁbu
tāvuga nādani nĕppuḍum̐ dalam̐suḍe tanabhāgyamu
śhrīvaiṣhṇavadharmamu dappaga sĕlam̐guḍaye vaibhavamu
devadāṁtaraṁbulanniyu māninadiye sukṛtaṁbu

(||idi||)
kāmakrodhamu lujjagiṁchuḍaye kalyāṇānubhavamu
semuṁchi pābamu seyaga mānuḍe sĕppam̐ga lābhamu
nemamudoḍuda viraktum̐ḍaguḍe nirmalānaṁdamu
vemaru nāsāryaseva seyuḍe visāriṁpam̐ga dām̐sina dhanamu

(||idi||)
prakṛtivigāramulagum̐ jŏraguṁḍuḍe paramamaina sātvigamu
sagalabaṁdhamulam̐ bĕḍam̐ bāsinade sāmrājyabadamu
pragaḍiṁpam̐ga nalamelumaṁgagunu padiyagu śhrīveṁkaḍavibhuni
agalaṁkum̐ḍai kŏlisiyuṁḍuḍe yanaṁtamahimādiśhayaṁbu