Idiye kaamanidhaana midiye mooladhanamu

ఇదియే కామనిధాన మిదియే మూలధనము
Language

(॥పల్లవి॥)
ఇదియే కామనిధాన మిదియే మూలధనము
యిదియే నమ్ముట గాక యితరము లేలా

(॥ఇదియే॥)
‘న మే భక్తః ప్రణస్యతి’ యనుమాట
అమోఘమై నీ వానతియ్యఁగా
రమారమణుఁడ రతి నీ దాసుల కెల్ల
నమో హి నితరవిచారము లేలా

(॥ఇదియే॥)
నాఁడు ‘మా మేకం శరణం వ్రజ’ యనుమాట
పోడిమి దిక్కుల నీ వెప్పుడు చాటఁగా
నేఁడు నీ దాసులమై నెరవేరితిమి గాక
వేఁడి వేఁడి కర్మవువిధులిడ నేలా

(॥ఇదియే॥)
ఆల ‘యెగక్షేమం వహమ్యహ’ మ్మనుమాట
అలరుచు తుదిపదమై వుండఁగా
నెలవై శ్రీవేంకటేశ నిన్నుఁ గొలిచినమాకుఁ
గలిగె నీ కరుణ యే కథలు నేలా

(||pallavi||)
idiye kāmanidhāna midiye mūladhanamu
yidiye nammuḍa gāga yidaramu lelā

(||idiye||)
‘na me bhaktaḥ praṇasyadi’ yanumāḍa
amoghamai nī vānadiyyam̐gā
ramāramaṇum̐ḍa radi nī dāsula kĕlla
namo hi nidaravisāramu lelā

(||idiye||)
nām̐ḍu ‘mā megaṁ śharaṇaṁ vraja’ yanumāḍa
poḍimi dikkula nī vĕppuḍu sāḍam̐gā
nem̐ḍu nī dāsulamai nĕraveridimi gāga
vem̐ḍi vem̐ḍi karmavuvidhuliḍa nelā

(||idiye||)
āla ‘yĕgakṣhemaṁ vahamyaha’ mmanumāḍa
alarusu tudibadamai vuṁḍam̐gā
nĕlavai śhrīveṁkaḍeśha ninnum̐ gŏlisinamāgum̐
galigĕ nī karuṇa ye kathalu nelā