ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు
(॥పల్లవి॥)
ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు
కదిసి నీబంటనంటే కాతువు నన్నును
(॥ఇది॥)
నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను
నేరమి చేసేనంటే నిండును దూరు
యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే
గారవించి వహించుక కాతువు నన్నును
(॥ఇది॥)
వొక్కచో నర్థ మర్జించుకుండితే జన్మాలు పెక్కు
యెక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ
యెక్కడి సుద్దులునేల యిచ్చట నీనామము
గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును
(॥ఇది॥)
తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు
చపలసంసారినైతే శాంతి యుండదు
ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి
కపటము మానితేను కాతువు నన్నును
(||pallavi||)
idiye buddhi nāgu niṁtagaṁṭe maṟiledu
kadisi nībaṁṭanaṁṭe kāduvu nannunu
(||idi||)
nerasi naḍasenaṁṭe nem̐ gānu svadaṁtruḍam̐nu
nerami sesenaṁṭe niṁḍunu dūru
yīrĕṁṭigim̐ gāga nenu yiṭṭĕ nīgu śharaṇaṁṭe
gāraviṁchi vahiṁchuga kāduvu nannunu
(||idi||)
vŏkkaso nardha marjiṁchuguṁḍide janmālu pĕkku
yĕkkenaṁṭe mokṣhamu yeḍo yĕṟam̐ga
yĕkkaḍi suddulunela yichchaḍa nīnāmamu
gakkanam̐ bergŏṁṭem̐ dayam̐ gāduvugā nannunu
(||idi||)
tabasinayyenaṁṭem̐ jittamu kaivaśhamu gādu
sabalasaṁsārinaide śhāṁti yuṁḍadu
ubamalela śhrīveṁkaḍottama nīseva sesi
kabaḍamu mānidenu kāduvu nannunu