ఇదివో విచారము యేమందు నిన్ను
(॥పల్లవి॥)
ఇదివో విచారము యేమందు నిన్ను
పదవి నీవే యొసఁగి పిరి తియ్యనేలా
(॥ఇదివో॥)
మారుమాఁటలాడక మానాన నుండేటివారి
ఆరీతి వేఁడుకొంటా నంటుకోనేల
వూరకే తప్పితారి నీగోరే నిన్నుఁ దాఁకితే
బీరానఁ దప్పులువేసి బిగియనేల
(॥ఇదివో॥)
శిరసు వంచుకొనుచు సిగ్గున నుండేటివారి
తెరలించి వొడివట్టి తియ్యఁగనేల
నిరతపు నీ చేతల నీతురుమే వీడితేను
సరుగ నెగ్గులువట్టి జంకించనేలా
(॥ఇదివో॥)
కళవట్టి రతులలో కాఁగిటనుండినవారి
తెలిపి సారెసారెకు దీకొననేలా
కలసి శ్రీ వేంకటేశ కడు నీవే యలసితే
నలువంక నాతో నవ్వు నవ్వఁగ నేలా
(||pallavi||)
idivo visāramu yemaṁdu ninnu
padavi nīve yŏsam̐gi piri tiyyanelā
(||idivo||)
mārumām̐ṭalāḍaga mānāna nuṁḍeḍivāri
ārīdi vem̐ḍugŏṁṭā naṁṭugonela
vūrage tappidāri nīgore ninnum̐ dām̐kide
bīrānam̐ dappuluvesi bigiyanela
(||idivo||)
śhirasu vaṁchugŏnusu sigguna nuṁḍeḍivāri
tĕraliṁchi vŏḍivaṭṭi tiyyam̐ganela
niradabu nī sedala nīdurume vīḍidenu
saruga nĕgguluvaṭṭi jaṁkiṁchanelā
(||idivo||)
kaḽavaṭṭi radulalo kām̐giḍanuṁḍinavāri
tĕlibi sārĕsārĕgu dīgŏnanelā
kalasi śhrī veṁkaḍeśha kaḍu nīve yalaside
naluvaṁka nādo navvu navvam̐ga nelā