ఇదివో వీదివీదుల నీతని తేరు
(॥పల్లవి॥)
ఇదివో వీదివీదుల నీతని తేరు
యెదుట శ్రీవేంకటాద్రిని తేరు
(॥ఇది॥)
చట్టువడఁ దోలె నాఁడు సముద్రాలపైఁ దేరు
ఘెుట్టుగాఁ దోలెను పౌండ్రకునిపైఁ దేరు
జట్టిగొని తోలె జరాసంధునిపై నదె తేరు
కొట్టి తోలె హంసడిచుకులపై(???) తేరు
(॥ఇది॥)
ఘోరమై కుంగఁగఁ దోలె కులగిరులపైఁ దేరు
కౌరవసేనపై దోలె గక్కనఁ దేరు
కోరి మధురమీఁద నక్రూరుఁ గూడ తోలెఁ దేరు
ఆరసి సంధిమాటలు ఆడఁ దోలెఁ దేరు
(॥ఇది॥)
తచ్చి శిశుపాలాది దైత్యులపైఁ దోలెఁ దేరు
పెచ్చుగాఁ దోలె రుక్మిణి పెండ్లి తేరు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చెచ్చెరఁ దోలె దిక్కుల సింగారపుఁ దేరు
(||pallavi||)
idivo vīdivīdula nīdani teru
yĕduḍa śhrīveṁkaḍādrini teru
(||idi||)
saṭṭuvaḍam̐ dolĕ nām̐ḍu samudrālabaim̐ deru
ghĕుṭṭugām̐ dolĕnu pauṁḍragunibaim̐ deru
jaṭṭigŏni tolĕ jarāsaṁdhunibai nadĕ teru
kŏṭṭi tolĕ haṁsaḍisugulabai(???) teru
(||idi||)
ghoramai kuṁgam̐gam̐ dolĕ kulagirulabaim̐ deru
kauravasenabai dolĕ gakkanam̐ deru
kori madhuramīm̐da nakrūrum̐ gūḍa tolĕm̐ deru
ārasi saṁdhimāḍalu āḍam̐ dolĕm̐ deru
(||idi||)
tachchi śhiśhubālādi daityulabaim̐ dolĕm̐ deru
pĕchchugām̐ dolĕ rukmiṇi pĕṁḍli teru
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁgam̐ gūḍi
sĕchchĕram̐ dolĕ dikkula siṁgārabum̐ deru