ఇదివో వలపు చింది యినుమడాయను
(॥పల్లవి॥)
ఇదివో వలపు చింది యినుమడాయను
యెదుట నీ భాగ్యమాయ నిఁక నేఁటిదయ్యా
(॥ఇది॥)
చెలియ నీ వింటికి విచ్చేసిన పరాకున
మలసి పయ్యద వెట్ట మరచె నదే
వెలయ నీ వింతలో నవ్విన నవ్వులకు నిట్టె
చలివాసి తన కొప్పు జారుటా నెరఁగదు
(॥ఇది॥)
పడఁతి నీ చూపులు పైఁ బారిన సంభ్రమమున
బడినె పాయపు సిగ్గుపడ మరచె
జడియక నీ వంతలో సరసము లాడితేను
వొడలఁ జెమట నిండి వొలుకుట చూడదు
(॥ఇది॥)
వేవేగ నీవు గూడిన వేడుక నలమేల్‌మంగ
శ్రీవెంకటేశుఁడు తనచేఁత మఱచె
భావించి నీవంతలోనె పైపై నెచ్చరించఁగాను
ఆవటించి తన మేని అలయికఁ గానదు
(||pallavi||)
idivo valabu siṁdi yinumaḍāyanu
yĕduḍa nī bhāgyamāya nim̐ka nem̐ṭidayyā
(||idi||)
sĕliya nī viṁṭigi vichchesina parāguna
malasi payyada vĕṭṭa marasĕ nade
vĕlaya nī viṁtalo navvina navvulagu niṭṭĕ
salivāsi tana kŏppu jāruḍā nĕram̐gadu
(||idi||)
paḍam̐ti nī sūbulu paim̐ bārina saṁbhramamuna
baḍinĕ pāyabu siggubaḍa marasĕ
jaḍiyaga nī vaṁtalo sarasamu lāḍidenu
vŏḍalam̐ jĕmaḍa niṁḍi vŏluguḍa sūḍadu
(||idi||)
vevega nīvu gūḍina veḍuga nalamelmaṁga
śhrīvĕṁkaḍeśhum̐ḍu tanasem̐ta maṟasĕ
bhāviṁchi nīvaṁtalonĕ paibai nĕchchariṁcham̐gānu
āvaḍiṁchi tana meni alayigam̐ gānadu