Idivo telusugoraa yimkaa neevu

ఇదివో తెలుసుకోరా యింకా నీవు
Language

(॥పల్లవి॥)
ఇదివో తెలుసుకోరా యింకా నీవు
మదనపరవశాన మర పాయఁ గాని

(॥ఇదివో॥)
వాలుకరెప్పలు నాపై వంచి వంచి చూచేవు
ఆలించి న న్నెరిఁగిన ట్టయ్యీనో నీకు
మేల మాడి చూడు తొల్లి మేనవారమే మనము
సోలిఁ బెక్కుసతులలో చూచి మర పాయను

(॥ఇదివో॥)
వీరి వారి యేకాంతాన విచారించి చూచేవు
కారన మే మైన నాతోఁ గద్దో నీకు
చేరి దగ్గరిన తొల్లి చెందిచుట్టాలమే
తారుకాణ లేక సందడి మర పాయనూ

(॥ఇదివో॥)
పెనఁగి పెనఁగి నన్ను పే రడిగి చూచేవు
కనుచూపులగురుతు కంటివో నీవు
యెన లే కలమేల్‌మంగను శ్రీవెంకటేశ్వర
మనరతులనుఁ జొక్కి మర పాయఁ గాని

(||pallavi||)
idivo tĕlusugorā yiṁkā nīvu
madanabaravaśhāna mara pāyam̐ gāni

(||idivo||)
vālugarĕppalu nābai vaṁchi vaṁchi sūsevu
āliṁchi na nnĕrim̐gina ṭṭayyīno nīgu
mela māḍi sūḍu tŏlli menavārame manamu
solim̐ bĕkkusadulalo sūsi mara pāyanu

(||idivo||)
vīri vāri yegāṁtāna visāriṁchi sūsevu
kārana me maina nādom̐ gaddo nīgu
seri daggarina tŏlli sĕṁdisuṭṭālame
tārugāṇa lega saṁdaḍi mara pāyanū

(||idivo||)
pĕnam̐gi pĕnam̐gi nannu pe raḍigi sūsevu
kanusūbulagurudu kaṁṭivo nīvu
yĕna le kalamel‌maṁganu śhrīvĕṁkaḍeśhvara
manaradulanum̐ jŏkki mara pāyam̐ gāni