ఇదివో తారుకాణాయ ఇట్టె వచ్చి కూడితివి
(॥పల్లవి॥)
ఇదివో తారుకాణాయ ఇట్టె వచ్చి కూడితివి
వదలకున్నది నీవు వలచితివంటాను
(॥ఇది॥)
యేడలేని యాసలతో యెదురుచూచీఁ జెలి
వాడికతో నీ వింటికి వచ్చేవంటాను
వీడెము చేతఁబట్టుక వేళ గాచుకున్నది
వేడుకతోఁ దనపొందు వెలయించేవంటాను
(॥ఇది॥)
పలుమారు నీ రూపే భావించుకున్నది చెలి
నిలిచి నీ వందుకు మన్నింతు వంటాను
తలఁచి నీపేరు నోరఁ దడవుకొంటా నున్నది
కలకాలమును నీవు కరుణింతువంటాను
(॥ఇది॥)
కూటమికి నీరాక కోరుక వున్నది చెలి
నీటునఁ దన్నుఁ గాఁగిట నించేవంటాను
యీటున శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చోటిచ్చుకున్నది రతిఁ జొక్కించేవంటాను
(||pallavi||)
idivo tārugāṇāya iṭṭĕ vachchi kūḍidivi
vadalagunnadi nīvu valasidivaṁṭānu
(||idi||)
yeḍaleni yāsalado yĕdurusūsīm̐ jĕli
vāḍigado nī viṁṭigi vachchevaṁṭānu
vīḍĕmu sedam̐baṭṭuga veḽa gāsugunnadi
veḍugadom̐ danabŏṁdu vĕlayiṁchevaṁṭānu
(||idi||)
palumāru nī rūbe bhāviṁchugunnadi sĕli
nilisi nī vaṁdugu manniṁtu vaṁṭānu
talam̐si nīberu noram̐ daḍavugŏṁṭā nunnadi
kalagālamunu nīvu karuṇiṁtuvaṁṭānu
(||idi||)
kūḍamigi nīrāga koruga vunnadi sĕli
nīḍunam̐ dannum̐ gām̐giḍa niṁchevaṁṭānu
yīḍuna śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
soḍichchugunnadi radim̐ jŏkkiṁchevaṁṭānu