ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది
(॥పల్లవి॥)
ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది
సదరముగా హరి చాటీ నదివో
(॥ఇది॥)
యెనసి పుణ్యముసేసి యే లోకమెక్కిన
మనికై భూమియందు మగుడఁ బొడముటే
పొనిగి “యా బ్రహ్మభువనా లోకాః
పునరావృత్తి” యనెఁ బురుషోత్తముఁడు
(॥ఇది॥)
తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన
పటుగతితో మోక్షపదము సులభమనె
ఘటన “మాముపేత్యతు కౌంతేయ” మహిని
నటనఁ “బునర్జన్మ న విద్యతే”
(॥ఇది॥)
యిన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవె
పన్నినగతి నిహపరసాధన మదే
మన్నించి యాతఁడే “మన్మనా భవ” యని
అన్నిటా నందరి కానతిచ్చెఁగాన
(||pallavi||)
idivo śhrudimūla mĕduḍane vunnadi
sadaramugā hari sāḍī nadivo
(||idi||)
yĕnasi puṇyamusesi ye logamĕkkina
manigai bhūmiyaṁdu maguḍam̐ bŏḍamuḍe
pŏnigi “yā brahmabhuvanā logāḥ
punarāvṛtti” yanĕm̐ buruṣhottamum̐ḍu
(||idi||)
taḍuguna śhrīhari tannune kŏlisina
paḍugadido mokṣhabadamu sulabhamanĕ
ghaḍana “māmubetyadu kauṁteya” mahini
naḍanam̐ “bunarjanma na vidyade”
(||idi||)
yinniḍā śhrīveṁkaḍeśhvaru sevĕ
panninagadi nihabarasādhana made
manniṁchi yādam̐ḍe “manmanā bhava” yani
anniḍā naṁdari kānadichchĕm̐gāna