Idivo ramanuda yemmelagu

ఇదివో రమణుడ యెమ్మెలకు
Language

(॥పల్లవి॥)
ఇదివో రమణుడ యెమ్మెలకు
సుదతి వేఁడుకొనీ సొమ్ములకు

(॥ఇది॥)
వెలఁది నిన్నుఁగని వేడుకమాటల
వలపుల చల్లి వాడికెకు
తొలుకరిమెఱుఁగులు తొలఁకేటి చూపుల
సొలపుల నించీ సూటులకు

(॥ఇది॥)
కాంత నీ యెదుట కందువ నవ్వుల
వంతులు వెట్టీ వాసులకు
వింత బాగులను వేడుక చెనకుల
పంతము చూపీ బలుములకు

(॥ఇది॥)
వనిత నీ కాఁగిట వట్రువ చన్నుల-
మొన లటు చూపీ ముద్దులకు
యెనయుచు శ్రీవేంకటేశ నిను రతుల
వినయము చేసి విందులకు

(||pallavi||)
idivo ramaṇuḍa yĕmmĕlagu
sudadi vem̐ḍugŏnī sŏmmulagu

(||idi||)
vĕlam̐di ninnum̐gani veḍugamāḍala
valabula salli vāḍigĕgu
tŏlugarimĕṟum̐gulu tŏlam̐keḍi sūbula
sŏlabula niṁchī sūḍulagu

(||idi||)
kāṁta nī yĕduḍa kaṁduva navvula
vaṁtulu vĕṭṭī vāsulagu
viṁta bāgulanu veḍuga sĕnagula
paṁtamu sūbī balumulagu

(||idi||)
vanida nī kām̐giḍa vaṭruva sannula-
mŏna laḍu sūbī muddulagu
yĕnayusu śhrīveṁkaḍeśha ninu radula
vinayamu sesi viṁdulagu