ఇదివో నీవు సేసిన యెమ్మెలు
(॥పల్లవి॥)
ఇదివో నీవు సేసిన యెమ్మెలు
గుదులాయ మోవిమీఁది కుమ్మెలు
(॥ఇది॥)
కన్నులఁ జూచినప్పటికాఁకలు
అన్నిటాఁ జెలికిఁ గొమరాఁకలు
విన్నవించుదాఁకా విఱ్ఱవీఁకలు
మున్నాడీఁ బులకలమూఁకలు
(॥ఇది॥)
చెక్కుల నీవుసేసినచేఁతలు
మొక్కలపుసవతుల మోఁతలు
యిక్కువవలపులెల్లా యీఁతలు
పుక్కిటిబంటితలపోఁతలు
(॥ఇది॥)
సుదతిఁ బెట్టిన నీ చొక్కులు
చెదరని రతులలో చిక్కులు
యిదివో శ్రీవేంకటేశ యిద్దరి మిమ్ముఁ గూడించె
మొదల నాపెచేతిమొక్కులు
(||pallavi||)
idivo nīvu sesina yĕmmĕlu
gudulāya movimīm̐di kummĕlu
(||idi||)
kannulam̐ jūsinappaḍigām̐kalu
anniḍām̐ jĕligim̐ gŏmarām̐kalu
vinnaviṁchudām̐kā viṭravīm̐kalu
munnāḍīm̐ bulagalamūm̐kalu
(||idi||)
sĕkkula nīvusesinasem̐talu
mŏkkalabusavadula mom̐talu
yikkuvavalabulĕllā yīm̐talu
pukkiḍibaṁṭidalabom̐talu
(||idi||)
sudadim̐ bĕṭṭina nī sŏkkulu
sĕdarani radulalo sikkulu
yidivo śhrīveṁkaḍeśha yiddari mimmum̐ gūḍiṁchĕ
mŏdala nābĕsedimŏkkulu