Idivo neeveṟamgavu yemtadi danevu aabe

ఇదివో నీవెఱఁగవు యెంతటి దనేవు ఆపె
Language

(॥పల్లవి॥)
ఇదివో నీవెఱఁగవు యెంతటి దనేవు ఆపె
సదరాననే యన్నిటాఁ జలము సాదించెను

(॥ఇది॥)
తేటపడ నింతి నిన్ను తిట్టు దిట్టదుగాని
గాటారింపుమాటలనే కల్లలాడెను
పాటించి ని న్నిందరిలో పంతము గొనదుగాని
చీటికి మాటికిఁ బంపు సేయించుకొనెను

(॥ఇది॥)
చేయి చాఁచి నీమీఁదఁ జెనక దింతేకాని
ఆయము లంటుతానే అలయించెను
రాయడించి నిన్ను నిట్టె రవ్వసేయదనికాని
చాయలనే నీమోవి చప్పఁజేసెను

(॥ఇది॥)
మెలుపున నీతోను మితిమీర దింతేకాని
కెలసి రతులనెల్లాఁ దిందుపరచె
కలసితి విటు నన్ను గక్కన శ్రీవేంకటేశ
తొలుతనే యిపె నిన్ను దుష్టుఁ జేసెను

(||pallavi||)
idivo nīvĕṟam̐gavu yĕṁtaḍi danevu ābĕ
sadarānane yanniḍām̐ jalamu sādiṁchĕnu

(||idi||)
teḍabaḍa niṁti ninnu tiṭṭu diṭṭadugāni
gāḍāriṁpumāḍalane kallalāḍĕnu
pāḍiṁchi ni nniṁdarilo paṁtamu gŏnadugāni
sīḍigi māḍigim̐ baṁpu seyiṁchugŏnĕnu

(||idi||)
seyi sām̐si nīmīm̐dam̐ jĕnaga diṁtegāni
āyamu laṁṭudāne alayiṁchĕnu
rāyaḍiṁchi ninnu niṭṭĕ ravvaseyadanigāni
sāyalane nīmovi sappam̐jesĕnu

(||idi||)
mĕlubuna nīdonu midimīra diṁtegāni
kĕlasi radulanĕllām̐ diṁdubarasĕ
kalasidi viḍu nannu gakkana śhrīveṁkaḍeśha
tŏludane yibĕ ninnu duṣhṭum̐ jesĕnu