ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినాఁ దానే
(॥పల్లవి॥)
ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినాఁ దానే
యెదిటి బ్రహ్మాండము యిమ్ము చాల దిందుకు
(॥ఇది॥)
పనిగొంటే భువిలో నేఁబదియే అక్షరములు
కొనాడితే నీగుణాలు కోటానఁగోటి
యెనసి పదునాలుగే యెడమైన లోకములు
అనిశము నీవియైతే ననంతమహిమలు
(॥ఇది॥)
మించి నిండుకొంటే నెనిమిదియే దిక్కులు
అంచల నీకతలైతే ననేకములు
యెంచి చూచితేఁ గలవి పంచమహాభూతాలే
ముంచిన నీమాయ తుదమొదలే లేదు
(॥ఇది॥)
వుపమించి తెలిసితే నొక్కటే జగము
అపురూపపు నీసృష్టి అతిఘనము
అపరిమితపు జీవు లణువత్రులైనాను
యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు
(||pallavi||)
idivo nīpradābamu yĕkkaḍa sūsinām̐ dāne
yĕdiḍi brahmāṁḍamu yimmu sāla diṁdugu
(||idi||)
panigŏṁṭe bhuvilo nem̐badiye akṣharamulu
kŏnāḍide nīguṇālu koḍānam̐goḍi
yĕnasi padunāluge yĕḍamaina logamulu
aniśhamu nīviyaide nanaṁtamahimalu
(||idi||)
miṁchi niṁḍugŏṁṭe nĕnimidiye dikkulu
aṁchala nīgadalaide nanegamulu
yĕṁchi sūsidem̐ galavi paṁchamahābhūdāle
muṁchina nīmāya tudamŏdale ledu
(||idi||)
vubamiṁchi tĕliside nŏkkaḍe jagamu
aburūbabu nīsṛṣhṭi adighanamu
abarimidabu jīvu laṇuvatrulainānu
yĕbuḍu śhrīveṁkaḍeśha yĕkkuḍu nīdāsulu