Idivo neemagam dunnaa dimka nennamde

ఇదివో నీమగఁ డున్నా డిఁక నెన్నఁడే
Language

(॥పల్లవి॥)
ఇదివో నీమగఁ డున్నా డిఁక నెన్నఁడే
పదివేలకు నీమేలు పచారించవలదా

(॥ఇది॥)
జక్కవలు చన్నులట చకోరాలు కన్నులట
యెక్కువతో యురియక యేల మానేవే
చెక్కులే యుద్దములట చిగురు మోవియట
వెక్కసమై నీ వింత విఱ్ఱవీఁగవలదా

(॥ఇది॥)
అలులు నీకురులట అంబుజము మొగమట
యెలమి నెమ్మెలు చూప కేల మానేవే
పులినపుఁబిరుఁదట తిలపుష్పనాస వట
మెలఁగి నీ వింతేసి మితిమీరవలదా

(॥ఇది॥)
నెమ్మది లతాంగివట నిత్యజవ్వనివీనట
యిమ్ముల నీరాజసము లిఁక నెన్నఁడే
చిమ్ముచు నీనాయకుఁడు శ్రీవేంకటేశుఁడు గూడె
పమ్ముచునీవన్నెలిట్టె పచరించవలదా

(||pallavi||)
idivo nīmagam̐ ḍunnā ḍim̐ka nĕnnam̐ḍe
padivelagu nīmelu pasāriṁchavaladā

(||idi||)
jakkavalu sannulaḍa sagorālu kannulaḍa
yĕkkuvado yuriyaga yela māneve
sĕkkule yuddamulaḍa siguru moviyaḍa
vĕkkasamai nī viṁta viṭravīm̐gavaladā

(||idi||)
alulu nīgurulaḍa aṁbujamu mŏgamaḍa
yĕlami nĕmmĕlu sūba kela māneve
pulinabum̐birum̐daḍa tilabuṣhpanāsa vaḍa
mĕlam̐gi nī viṁtesi midimīravaladā

(||idi||)
nĕmmadi ladāṁgivaḍa nityajavvanivīnaḍa
yimmula nīrājasamu lim̐ka nĕnnam̐ḍe
simmusu nīnāyagum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
pammusunīvannĕliṭṭĕ pasariṁchavaladā