Idivo needoradana mimkaa nemi seppenu

ఇదివో నీదొరతన మింకా నేమి చెప్పేను
Language

(॥పల్లవి॥)
ఇదివో నీదొరతన మింకా నేమి చెప్పేను
సదరమైతి నీ యాడే జాణతనాలకును

(॥ఇది॥)
చలివాసి యాపె నీతో సారె వెంగేలాడఁగాను
నలిరేఁగి నీవు గడునవ్వఁగాను
చులుకనివాఁడవైతి సుదతుల కెల్లాను
మెలఁగి చూడఁగ మందెమేలాలపాలైతివి

(॥ఇది॥)
సందడి మాలో నీతో సన్న లాపె సేయఁగాను
మందలించి నీవు లోనై మన్నించఁగాను
అందరియెంగిలి వైతి వాడికలకు లోనై
కందువరతులలోన కంకివైతివి

(॥ఇది॥)
గక్క నిన్నిపు డాపె కాఁగిలించి కూడఁగాను
మిక్కిలి శ్రీవేంకటేశ మెచ్చఁగాను
లక్కవంటివాఁడవైతి లాగుల మాతోఁ గరఁగి
కక్కసించఁగా రొంపిలో కంబమవైతివి

(||pallavi||)
idivo nīdŏradana miṁkā nemi sĕppenu
sadaramaidi nī yāḍe jāṇadanālagunu

(||idi||)
salivāsi yābĕ nīdo sārĕ vĕṁgelāḍam̐gānu
nalirem̐gi nīvu gaḍunavvam̐gānu
suluganivām̐ḍavaidi sudadula kĕllānu
mĕlam̐gi sūḍam̐ga maṁdĕmelālabālaidivi

(||idi||)
saṁdaḍi mālo nīdo sanna lābĕ seyam̐gānu
maṁdaliṁchi nīvu lonai manniṁcham̐gānu
aṁdariyĕṁgili vaidi vāḍigalagu lonai
kaṁduvaradulalona kaṁkivaidivi

(||idi||)
gakka ninnibu ḍābĕ kām̐giliṁchi kūḍam̐gānu
mikkili śhrīveṁkaḍeśha mĕchcham̐gānu
lakkavaṁṭivām̐ḍavaidi lāgula mādom̐ garam̐gi
kakkasiṁcham̐gā rŏṁpilo kaṁbamavaidivi