Idivo needodi pomdu imtesheyaa

ఇదివో నీతోడి పొందు ఇంతేశేయా
Language

(॥పల్లవి॥)
ఇదివో నీతోడి పొందు ఇంతేశేయా
యెదుట నున్నది చెలి యెఱుఁగుకోవయ్యా

(॥॥)
కొమ్మచిత్తములోనిచింత కొప్పు నెరులై నిండె
ముమ్మడితరితీపల్లా మోవిపండాయ
నెమ్మది నడియాసలు నివ్వెరగుచూపులాయ
పమ్మి పరాకులేల తప్పక చూడవయ్యా

(॥॥)
జలజాక్షి కోరికలు చనుఁగవరాసులాయ
వలపులు రోమరాజివరుసలాయ
వెలలేనితమకము వేఁకమై పిఱుఁదాయ
తలపోఁత లీడెర్చి దయ సేయవయ్యా

(॥॥)
కోమలిరతిభావాలు కొనగోరివాండ్లాయ
భూమిఁగల ఇంపులెల్లాఁ బులకలాయ
యీమేర శ్రీ వేంకటేశ యీకె నిట్టె కూడితివి
దోమటిసంతోసాలు తుదిపదములయ్యా

(||pallavi||)
idivo nīdoḍi pŏṁdu iṁteśheyā
yĕduḍa nunnadi sĕli yĕṟum̐gugovayyā

(||||)
kŏmmasittamulonisiṁta kŏppu nĕrulai niṁḍĕ
mummaḍidaridīballā movibaṁḍāya
nĕmmadi naḍiyāsalu nivvĕragusūbulāya
pammi parāgulela tappaga sūḍavayyā

(||||)
jalajākṣhi korigalu sanum̐gavarāsulāya
valabulu romarājivarusalāya
vĕlalenidamagamu vem̐kamai piṟum̐dāya
talabom̐ta līḍĕrsi daya seyavayyā

(||||)
komaliradibhāvālu kŏnagorivāṁḍlāya
bhūmim̐gala iṁpulĕllām̐ bulagalāya
yīmera śhrī veṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
domaḍisaṁtosālu tudibadamulayyā