(॥పల్లవి॥)
ఇదివో నీపొందు లెట్టనరాదు
కదిసితే నంటురాయిగతివంటివాఁడవు
(॥॥)
సూటిగా నీసింగారము చూడఁగవచ్చుఁగాని
నాటినచూపు దిప్పుకొనఁగరాదు
మాటలు నీతో నాడి మలయఁగవచ్చుఁగాని
మాటికి నీసల్లాపము మరవఁగరాదు
(॥॥)
ననుపు సేసుక నీతో నవ్వఁగవచ్చుఁగాని
వెనక నది యణఁచుకొనఁగరాదు
చెనకి సరసమున చేత నంటవచ్చుఁగాని
పెనగొన్న కేలు విడిపించఁగరాదు
(॥॥)
కలయికరతి నిన్నుఁ గాఁగిలించవచ్చుఁగాని
వలవంతఁ గొంతైనా వదలరాదు
చెలరేఁగి నీవె నన్ను శ్రీ వేంకటేశ కూడితివి
యిల మెచ్చవచ్చుఁగాని యేమి ననరాదు
(||pallavi||)
idivo nībŏṁdu lĕṭṭanarādu
kadiside naṁṭurāyigadivaṁṭivām̐ḍavu
(||||)
sūḍigā nīsiṁgāramu sūḍam̐gavachchum̐gāni
nāḍinasūbu dippugŏnam̐garādu
māḍalu nīdo nāḍi malayam̐gavachchum̐gāni
māḍigi nīsallābamu maravam̐garādu
(||||)
nanubu sesuga nīdo navvam̐gavachchum̐gāni
vĕnaga nadi yaṇam̐sugŏnam̐garādu
sĕnagi sarasamuna seda naṁṭavachchum̐gāni
pĕnagŏnna kelu viḍibiṁcham̐garādu
(||||)
kalayigaradi ninnum̐ gām̐giliṁchavachchum̐gāni
valavaṁtam̐ gŏṁtainā vadalarādu
sĕlarem̐gi nīvĕ nannu śhrī veṁkaḍeśha kūḍidivi
yila mĕchchavachchum̐gāni yemi nanarādu